TRINETHRAM NEWS

తేదీ: 30/12/2024.
పట్టించుకోని పంచాయితీ అధికారులు.
ఎన్టీఆర్ జిల్లా: (త్రినేత్రం) న్యూస్;
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఎన్టీఆర్ జిల్లా, తిరువూరు నియోజకవర్గం , విస్సన్నపేట మండలం , గ్రామం ఏ కొండూరు వెళ్లే రోడ్డు మార్గంలో ఉన్న శ్రీనగర్ కాలనీ 5వ నంబరు వీధి చాలా దారుణంగా ఉంది. మురికి కాలువలు మరియు చెత్తా విపరీతంగా పెరిగిపోయి ఉన్నది. కాలువల్లో డ్రైనేజీ కంపు అందులో దోమలు బె డదా ఎక్కువైపోతున్నది. ఉదయం నుండి రాత్రి వరకు కూడా ఇళ్లల్లో దోమలు విపరీతంగా తిరుగుతున్నాయి.
దోమలు కుట్టడం వలన చిన్న పెద్ద తేడా లేకుండా టైపేడ్ మలేరియా డెంగ్యూ వైరస్ లు సోకి వైద్యశాల కు ప్రజలు వెళ్లడం జరుగుతుంది. పంచాయితీ అధికారులకు ఎన్ని సార్లు వినతి పత్రాలు ఇచ్చినా పట్టించుకునె నాధుడే లేడు. వీధి పైపుల్లో కూడా నీరు రాక సంవత్సరం దాటింది. చెప్పగా చెప్పగా పాత పైపులు తవ్వి తీసికొత్త పైపులు అమర్చినారు కానీ ఉదయం నుండి రాత్రి వరకు కూడా నీళ్లు రావడం లేదు అడిగితే ట్యాంకులోకి నీళ్లు సరిపోక రావడంలేదని అధికారులు చెప్పకొస్తున్నారు. ఇది ఇలా ఉండగా కోతుల బెడద కూడా ఎక్కువగానే ఉన్నది. ఉదయం నుండి రాత్రి పడుకునే సమయంవరకు కూడా ఇళ్లల్లో కోతులు వచ్చి ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. ఇంట్లో నుండి బయటికి వెళ్లడానికి కోతులు కరుస్తాయో అని ఏ క్షణంఏం జరుగుతుందో తెలియని పరిస్థితి ఏర్పడింది.
దయచేసి డ్రైనేజీ , మంచినీరు, కోతుల సమస్యను పంచాయతీ అధికారులు తీర్చలని ప్రజలు అంటున్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App