ఆంధ్రప్రదేశ్, త్రినేత్రం న్యూస్, ( జి. మాడుగుల మండలం ) అల్లూరిజిల్లా ఇంచార్జ్ : ( మణిబాబు ) పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలి.
అల్లూరిజిల్లా, పాడేరు నియోజకవర్గం, జి.మాడుగుల మండల నాయకులకు దిశానిర్ధేశం చేసిన శాసన సభ్యులు, అల్లూరి జిల్లా అధ్యక్షులు మత్స్యరాస విశ్వేశ్వర రాజు.
_జి.మాడుగుల మండల, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల పార్టీ అధ్యక్షుడు అధ్యక్షతన మండల బాడీ సమావేశం కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన పాడేరు శాసన సభ్యులు, అల్లూరి జిల్లా అధ్యక్షులు *మత్స్యరాస విశ్వేశ్వర రాజు.
మండల పార్టీ సమావేశంలో 17 పంచాయితీల నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్పంచులు, ఎంపీటీసీలు సీనియర్ నాయకులు వివిధ పదవుల్లో ఉన్న నాయకులకు శాసన సభ్యులు దిశానిర్ధేశం చేశారు. ఈ కార్యక్రమానికి ఉద్దేశించి శాసన సభ్యులు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారం వచ్చిందని మన నాయకులకు కార్యకర్తలకు లేని పోని ప్రలోభాలు పెడతారు, ఎవ్వరు అధైర్య పడకండి ధైర్యంగా ఉండండి. మీ అందరికీ అండగా నేను ఉంటాను అని అన్నారు. ఈ ఐదు నెలల టిడిపి కూటమి ప్రభుత్వం చేసే అరాచకం పరిపాలన గురించి ప్రతి ఒక్క వైస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త గ్రామ స్థాయి వరకు అవగాహనా కల్పించి పోరాటం చెయ్యాలన్నారు. సూపర్ సిక్స్ పథకాలు ఎ ఒక్క పథకాలు అమలు చెయ్యకుండా గాలికి వదిలేసారు అని అన్నారు.
_కూటమి ప్రభుత్వం అరాచక పరిపాలన పరిపలిస్తున్నారు. ఈ భూటకపు పరిపాలన అరాచకాలు తిప్పికొట్టాలి. గ్రామస్థాయి నుండి,మండల స్థాయి వరకు పార్టీ కార్యక్రమాలకు ప్రతి ఒక్కరూ సమన్వయం చేసుకుంటూ కలిసి కట్టుగా మన నాయకులు అందరు ప్రజలకు అవగాహన కల్పించాలని అన్నారు.
రానున్న రోజుల్లో కూటమి ప్రభుత్వనీకి తగిన గుణపాఠం చెప్పడానికి, ప్రజలంతా సిద్ధంగా ఉండాలన్నారు.
ఈ కార్యక్రమం లో మండల పార్టీ అధ్యక్షులు నుర్మాని మత్య కొండం నాయుడు, వైస్ ఎంపీపీ కడుముల సత్యనారాయణ, స్థానిక సర్పంచ్ కిముడు రాంబాబు, ఎంపీటీసీ మత్స్యరాస విజయ కుమారి, సర్పంచుల పోరం అధ్యక్షులు సురబంగి రామక్రిష్ణ, మాజీ ఎంపీపీ మత్స్యరాస వెంకట గంగరాజు, లువ్వసింగి ఎంపీటీసీ G.S.దొరా, సొలబంగి ఎంపీటీసీ కూడ చిన్నారావు, సొలబంగి సర్పంచ్ ఐశారం హనుమంతరావు, సింగార్బ ఎంపీటీసీ పాంగీ లక్ష్మి, పెదాలోచలి సర్పంచ్ బోడిగి చిన్న కుమారి, గెమ్మేలి సర్పంచ్ సీదరి రాంబాబు, కోరపల్లి సర్పంచ్ మాసడి బాలన్న, బొయితిలి సర్పంచ్ లస్సంగి మాలన్న, సింగర్బ సర్పంచ్ మాసడి గంగరాజు, నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు,
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App