భారత కమ్యూనిస్టుపార్టీ కి వందేళ్లు పూర్తి – పి. సత్యనారాయణ.
సిపిఐ పార్టీ శతదినోత్సవ వేడుకల్లో భాగంగా మునసలిలో పార్టీ జెండా ఆవిష్కరణ.
ఆంధ్రప్రదేశ్, త్రినేత్రంన్యూస్,( కొయ్యూరు మండలం ) జిల్లా ఇంచార్జ్ : దున్నేవాడిదే భూమి. అని లక్షల ఎకరాలు రైతులకు ఇచ్చిన పార్టీ సిపిఐ పార్టి.
అల్లూరి జిల్లా సిపిఐ పార్టి కార్యదర్శి పొట్టిక సత్యనారాయణ.
వంద సంవత్సరాల ఉద్యమ నేపథ్యంలో అశేషమైన, త్యాగాలు తో పాటు, అనేక ఆటుపోట్లు ఎదుర్కొని, సమాజ స్థాపన కోసం సామాజిక రుగ్మతలకు వ్యతిరేకంగా పోరాడిన పార్టీ భారత కమ్యూనిస్టు పార్టీ అని, అల్లూరి సీతారామరాజు జిల్లా సిపిఐ పార్టీ కార్యదర్శి, పొట్టిక సత్యనారాయణ అన్నారు. గురువారం కొయ్యూరు మండలంలో, అంతాడ పంచాయతీ, మునసలి గ్రామంలో భారత కమ్యూనిస్టు పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జెండాను ఆవిష్కరించారు. మునసలి గ్రామం అంతా సిపిఐ పార్టీ జండాలతో, పార్టీ నినాదాలతో మారుమ్రోగి పోయింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్యాంకులను జాతీయకరణకు 200 ఏళ్లపాటు బ్రిటీష్ పాలకుల కబంధ హస్తాలలో బానిసత్వాన్ని, అనుభవించిన భారతదేశానికి సంపూర్ణ స్వాతంత్రం కొరకు అలుపెరగని సమరం సాగించింది . భారత కమ్యూనిస్టు పార్టీ,అని అన్నారు. దేశంలో పేద,రైతు కార్మిక ఉద్యోగ మహిళా విద్యార్థి, యువజనులను సమీకరించి వారి హక్కుల కోసం పోరాడిందన్నారు. దేశవ్యాప్తంగా దున్నేవాడికే భూమి అనే నినాదం ఇచ్చి, లక్షలాది ఎకరాల భూములను పేద ప్రజలకు మంచి ఇచ్చింది సిపిఐ పార్టీ అని తెలిపారు. భూమికోసం, భుక్తి కోసం బాలుడు అంగి మీ దేశం పౌరులందరికీ సమానంగా ఉండాలని జైల్లోకి వెళ్లి కేసులకు భయపడక ప్రాణత్యాగాలను ముద్దాడిన అరుణ తార సిపిఐ పార్టి అని అన్నారు. దోపిడీదారులకు, సింహ స్వప్నమై ప్రజలకు అప్పన్న హస్తమై ఎక్కడ పేదవాడికి సమస్య ఉద్భవించిన మేమున్నామంటూ నిలబడింది కమ్యూనిస్టు పార్టీ అని అన్నారు. కానీ అధికారంలో ఉన్న ఆర్ఎస్ఎస్ అనుబంధ రాజకీయ శాఖ బిజెపి కారణంగా అనేక పోరాటాలు చేసి తెచ్చుకున్న స్వాతంత్రం అనేక శ్రమలకోర్చి నిర్మించుకున్న భారత రాజ్యాంగం ప్రమాదంలో పడిందన్నారు. బిజెపి నరేంద్ర మోడీ నాయకత్వంలో రాజ్యాంగం స్థానంలో మనుధర్మ శాస్త్రాన్ని తీసుకురావాలని, బాహాటంగానే ఎన్నికల ప్రచారాన్ని చేసిందన్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ కార్యదర్శిఇరవాడ దేముడు, సహాయ కార్యదర్శి ఉల్లి సత్యనారాయణ , జిల్లా మహిళా అధ్యక్షురాలు వంతల లక్ష్మి, జిల్లా వ్యవసాయ కార్మిక సంఘం అధ్యక్షులు వియ్యపు నానాజీ, మాజీ సర్పంచ్ అల్లం పైడితల్లి, గిరిజన సమైక్య మండల అధ్యక్షులు పొటుకూరి దారి మల్లేష్, మండల కార్యవర్గ సభ్యులు ఉల్లి సూరిబాబు, మాదల సత్తి బాబు, జిల్లా సభ్యులు ఇరవాడ రాజు, సీపీఐ పార్టి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App