
Trinethram News :
గాజాలో హమాస్, ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధం సెగ ఆస్కార్ వేడుకలకు తగిలింది. లాస్ ఏంజెలిస్లోని డాల్బీ థియేటర్లో అవార్డుల ఈవెంట్ జరగగా.. గాజా మద్దతుదారులు అక్కడకు చేరుకుని నిరసనలు వ్యక్తం చేశారు. ఇజ్రాయెల్ కాల్పుల విరమణ ఒప్పందానికి రావాలంటూ ఆందోళనకారులు నినాదాలు చేస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు. తమకు మద్దతుగా నిలవాలని హాలీవుడ్ ప్రముఖుల్ని కోరారు. ఈ క్రమంలో ఆ మార్గంలో ట్రాఫిక్ నిలిచిపోయింది.
