డిప్యూటీ సీఎం భట్టిని కలిసిన ఆస్కార్ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్!
Trinethram News : Telangana : ఆర్ఆర్ఆర్ సింగర్, ‘నాటు నాటు’ పాటతో ప్రపంచాన్నే ఉర్రూతలూగించిన ఆస్కార్ అవార్డు గ్రహిత రాహుల్ సిప్లిగంజ్ డిప్యూటీ భట్టి విక్రమార్కను కలిశారు.
సోమవారం హైదరాబాద్‌లోని జ్యోతిరావుఫూలే ప్రజాభవన్‌లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను మర్యాద పూర్వకంగా కలిసినట్లు తెలిసింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి.
కాగా, రాహుల్ సిప్లిగంజ్ కాంగ్రెస్ సీనియర్ నేత, తెలంగాణ డిప్యూటీ సీఎంను కలవడం వెనుక మతలబు ఏమిటని కొన్ని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ ఎన్నికల సమయంలో రాహుల్ సిప్లి గంజ్‌కు ఒక ఆఫర్ ఇచ్చారు. గతంలో బోయిన్‌పల్లిలో జరిగిన రాజీవ్ గాంధీ ఆన్‌లైన్ క్విజ్ కాంపిటేషన్ ప్రోగ్రామ్ ప్రారంభానికి రాహుల్ సిప్లి గంజ్ చీఫ్ గెస్ట్‌గా వచ్చారు. ఆ ప్రొగ్రామ్‌లో సీఎం రేవంత్ మాట్లాడుతూ.. పేద కుటుంబం నుంచి ఆస్కార్ స్థాయికి వెళ్లిన రాహుల్‌ను బీఆర్ఎస్ ప్రభుత్వం సన్మానిస్తదనుకున్నా కానీ నిరాశపరిచిందని అన్నారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీ తరపున రూ. 10 లక్షల నగదు బహుమానం, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రూ. కోటి రూపాయల నగదు ఇస్తామని ఆయన ప్రకటించారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాడిన తర్వాత పది నెలలు గడుస్తున్న రాహుల్‌కు ఇచ్చిన మాట ప్రకారం కోటి రూపాయల నగదు ఇవ్వలేదని తాజాగా చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే రాహుల్ సిప్లిగంజ్ డిప్యూటీ సీఎం భట్టిని తాజాగా కలసినట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కాగా, రాహుల్ డిప్యూటీ సీఎం భట్టిని కలవడంపై వివరాలు బయటకు తెలియరాలేదు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App