TRINETHRAM NEWS

Online sand booking in AP from today

ఏపీలో ఇసుక బుకింగ్ కోసం రూపొందించిన ఏపీ శాండ్
Trinethram News : Andhra Pradesh : మేనేజ్మెంట్ పోర్టల్ నేడు అందుబాటులోకి రానుంది. ఉ.10.30-మ.12 వరకు గ్రామ, వార్డు సచివాలయాల్లో, మ. 12-సా.6 వరకు ఎవరైనా వ్యక్తిగతంగా బుకింగ్
చేసుకునేలా పోర్టల్ను రూపొందించారు. అయితే 24 గంటలూ బుకింగ్కు అవకాశం ఉండాలని సీఎం చంద్రబాబు ఆదేశించడం తో అధికారులు మార్పులు చేస్తున్నారు. వాగులు, వంకల నుంచి ఇసుక తీసుకెళ్లే
ప్రజలను ఇబ్బంది పెట్టొద్దని ఆయన స్పష్టం చేశారు.

ఇసుక ఆన్లైన్ బుకింగ్ ఇలా
https://www.mines.ap.gov.in/
వెబ్సైట్లోని ఏపీ శాండ్ మేనేజ్మెంట్ సిస్టమ్ (APSMS) పోర్టల్లో తొలుత రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.

  • ఆ తర్వాత జనరల్ కన్జ్యూమర్ అనే ఆప్షన్పై క్లిక్ చేసి, ఆధార్, మొబైల్ నంబర్ నమోదు చేయాలి.
    మెయిల్ ఐడీ, చిరునామా ఎంటర్ చేస్తే రిజిస్ట్రేషన్ ఖరారవుతుంది.
  • ఆ తర్వాత నిర్మాణ వివరాలు నమోదు చేయాలి.
    పేమెంట్ పూర్తిచేశాక ఏ రోజు డెలివరీ అవుతుందో మెసేజ్ వస్తుంది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Online sand booking in AP from today