TRINETHRAM NEWS

గోదావరిఖని పట్టణంలో వన్ టౌన్ పోలీసుల ఆకస్మిక పెట్రోలింగ్ మరియు విస్తృతంగా తనిఖీలు…

గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

గోదావరిఖని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రతి రోజు బ్లూ కోర్ట్ మరియు పెట్రో కార్ సిబ్బంది నిరంతరం 24*7 పెట్రోలింగ్ చేస్తున్నాము

కానీ గత కొన్ని రోజుల నుండి కొందరు ఆకతాయిల మద్యం సేవించి పోలీస్ పెట్రోలింగ్ వారు లేని సమయంలో డ్యూటీ కి వెళుతున్న, సింగరేణి ఉద్యోగులకు మరియు ప్రజలకు ఇబ్బంది కలిగిస్తున్నారు.

ఈ విషయంలో గోదావరిఖని 1 టౌన్ ఇన్స్‌పెక్టర్ ఆధ్వర్యంలో అర్ధరాత్రి ప్రత్యేక డ్రైవ్ చేయడం జరిగింది.

ఇట్టి కార్యక్రమంలో తిలక్ నగర్, విఠల్ నగర్, మార్కండేయ కాలనీ లో జులాయిగా తిరుగుతున్న యువకులను మరియు వారి మోటార్ సైకిల్ లను తీసుకొని పోలీస్ స్టేషన్ కు వచ్చి కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది.

ముఖ్యంగా పట్టణ శివారు ప్రాంతాలలో గంజాయి సేవించి ప్రదేశాలు గుర్తించి తనిఖీ చేయడం జరిగింది.

దొంగతనాలు ఎక్కువగా జరుగు ప్రదేశాలను గుర్తించి ఆయా ప్రాంతాలలో గట్టి నిఘా ఉంచడం జరుగుతుంది.

ఇట్టి పెట్రోలింగ్ ఇక మీదట ప్రతి రోజూ నిర్వహిస్తున్నాము.

సింగరేణి ఉద్యోగులకు మరియు సాధారణ ప్రజలకు ఎటువంటి ఇబ్బందులూ కలగకుండా చేయడం జరుగుతుంది.

గోదావరిఖని పట్టణంలో రాత్రి 11 గంటల తరువాత కాలనీలలో గాని మెయిన్ రోడ్డు ల మీద గాని మోటార్ సైకిల్ ల మీద తిరుగుచు ప్రజలకు ఇబ్బంది కలిగించే వారిపై చట్ట ప్రరంగా కఠిన చర్యలు తీసుకొని, వారి వాహనాలను లు సీజ్ చేయడం జరుగుతోంది.

ఇందుకోసం పట్టణ పరిధిలో ప్రతిరోజు రాత్రి గస్తీ నిర్వహించేందుకు ప్రత్యేక పోలీసు బృందాన్ని ఏర్పాటు చేయడం జరిగింది.

రాత్రి 11 తర్వాత గోదావరిఖని పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో గల దుకాణాలు గాని హోటల్స్ గాని తెరిచి ఉంచరాదు. ఒకవేళ తెరిచి ఉంచిన దుకాణ యజమానుల మీద చట్ట చర్య తీసుకోబడును.

రాత్రి జరిగిన తనిఖీలలో గోదావరిఖని రెండో పట్టణ ఇన్స్‌పెక్టర్ కె రవీందర్, ఎస్ఐలు రమేష్, శ్రీనివాస్ మరియు హెడ్ కానిస్టేబుల్ సిబ్బంది పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App