One digital card for every family as directed by Telangana state government
Trinethram News : వికారాబాద్ జిల్లా : 02-10-20 24.
రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ప్రతి కుటుంబానికి ఒక డిజిటల్ కార్డు ఇవ్వాలని, ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం లో ఒక అర్బన్ వార్డు, మరియు గ్రామా పంచయతీని ఫైలేట్ ప్రాజెక్ట్ గా సర్వే బృందాలను ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అన్నారు.
బుధవారము కాన్ఫరెన్సు హాలు నుండి మాట్లాడుతూ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వార పర్యవేక్షక బృందాలకు శిక్షణ ఇవ్వడం జరిగిందని కలెక్టర్ తెలిపారు.
కాన్ఫరెన్సు హాలు నుండి జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ , అదనపు కల్లెక్టర్లు లింగ్యా నాయక్, సుదీర్, ట్రిని కలెక్టర్ ఉమా హారతి , ఆర్ డి ఓ వాసుచంద్ర నాలుగు నియోజక వర్గాల మున్సిపల్ కమిషనర్లు, మర్పల్లి, యాలాల్ ,దోమ మండలాల ఏం పి డి ఓ లకు వీడియో కాన్ఫరెన్స్ ద్వార ఆదేశించారు.
. ఏర్పాటు చేసిన బృందాలకు శిక్షణ కార్యక్రామాలు నిర్వహించాలని, శిక్షణకు ఎంపిక చేసిన సిబ్బంది అందరు హాజరయ్యేలా చూడాలన్నారు. ఈ బృందాలు క్షేత్ర స్తా యీ లో సర్వేను ప్రారంభించాలన్నారు. మున్సిపల్ కమిషనర్లు డిజిటల్ కార్డు కు సంబంధించి ఫైలట్ ప్రాజెక్ట్ క్రింద వార్డు, గ్రామా పంచాయతీ లలో పూర్తి స్తా యి లోకుటుంబ డిజిటల్ కార్డుకు సంబంధించిన పరిశీలనా మొత్తం పూర్తి అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని, జిల్లా వ్యాప్తంగా ఈ అంశాన్నిఅదనపు కలెక్టర్ లు, ఆర్ డి ఓ లు సమన్వయము తో చేయాలనీ అన్నారు.
కుటుంబ డిజిటల్ కార్డు కోసం ఏర్పాటు చేసిన వారికీ శిక్షణ ను ఇచ్చామని అన్నారు. ప్రజలు అందుబాటులో ఉండే సమయంలో సర్వే కు వెళ్ళే విధంగా ప్లాన్ చేసుకోవాలని తెలిపారు. కుటుంబ సర్వే అంగన్వాడి టీచర్లకు తెలిసి ఉంటుందని ,వారి సహకారం తీసుకోవాలని, కుటుంబ ఫోటో ఎక్కడ కూడా మిస్ కాకుండా చూసుకోవాలని ,డేటా లో పూర్తి వివరాలు ఉండేలా చూడాలని ఆదేశించారు.
ఇట్టి కార్యక్రమానికి జూమ్ కాన్ఫరెన్సు ద్వార జిల్లా స్పెషల్ అధికారి శ్రీమతి.డి. దివ్యా ఐ ఎ .ఎస్ , పాల్గొనిఇట్టి కార్యక్రమాన్ని సజావుగా నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని పలు సూచనలు సలహాలు ఇచ్చారు.
ఈ వీడియో కాన్ఫరెన్సు లో సబ్ కలెక్టర్ తాండూర్ ఉమా శంకర్ ప్రసాద్, ఏం పి డి ఓ లు, తహసిల్దార్లు తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App