On the orders of Ramagundam MLA Raj Thakur
తెలంగాణ రాష్ట్ర స్టేట్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ గా నియమితులై, పదవీ బాధ్యతలు స్వీకరించిన అయిత ప్రకాష్ రెడ్డి మొదటిసారిగా
గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
రామగుండం నియోజకవర్గానికి విచ్చేసిన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కార్పొరేషన్ అధ్యక్షుడు బొంతల రాజేష్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు స్థానిక బి పవర్ హౌస్ గడ్డ వద్ద ఘనంగా స్వాగతం పలకడం జరిగింది..
ఆ తర్వాత స్థానిక ఎఫ్సిఐ క్రాస్ రోడ్ వద్ద గల భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసిన, అనంతరం స్థానిక గోదావరిఖని బస్టాండ్ వద్ద గల దివంగత నేత మాజీ శాసనసభ స్పీకర్ శ్రీ దుద్దిల్ల శ్రీపాదరావు విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించిన అనంతరం మీడియాతో మాట్లాడడం జరిగింది..
ఈ మీడియా సమావేశంలో కార్పొరేషన్ అధ్యక్షుడు బొంతల రాజేష్ మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు భూపాలపల్లి జిల్లా అధ్యక్షులు అయిత ప్రకాష్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ గా నియమితులవడం చాలా సంతోషకరమని, చాలా సంవత్సరాల క్రితం నుండి కాంగ్రెస్ పార్టీకీ విధేయుడుగా పని చేయడమే కాక, దుద్దిల్ల కుటుంబానికి అతి సన్నిహితుడుగా ఉన్నారు.
కష్ట సమయంలో పార్టీకి వెన్నంటూ ఉంటే ఖచ్చితంగా అధిష్టానం గుర్తించి పార్టీలో సముచిత స్థానం కల్పిస్తారనడానికి నిదర్శనమే ఈరోజు అయిత ప్రకాష్ రెడ్డి చైర్మన్ పదవి లభించడం, రానున్న రోజుల్లో అయిత ప్రకాష్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంలో వాణిజ్యం, వాణిజ్య లాజిస్టిక్స్ సృష్టి మరియు వాణిజ్య ప్రమోషన్ల మౌలిక సదుపాయాలను ప్రోత్సహించడంలో సమర్థవంతంగా పనిచేస్తారని ఆశిస్తూ, వారిని ఘనంగా స్వాగతం పలికేందుకు విచ్చేసిన కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు, మరియు వార్తను కవర్ చేసేందుకు విచ్చేసిన ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు నమస్సులు తెలియజేస్తున్నామని అన్నారు.
అనంతరం అయిత ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ, రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నానని, రానున్న రోజుల్లో మంత్రివర్యులు శ్రీ దుద్దిల్ల శ్రీధర్ బాబు రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు, భూపాలపల్లి ఎమ్మెల్యే గంట సత్యనారాయణ రావు సహకారంతో రాష్ట్రంలోని వివిధ వ్యాపారాల వాణిజ్య అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు..
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్పొరేటర్లు మాజీ కార్పొరేటర్లు, రామగుండం, ఎన్టిపిసి, గోదావరిఖని పట్టణ అధ్యక్షులతో పాటు, ఎస్సీ, బీసీ, మహిళా, మైనార్టీ, ఎన్.ఎస్.యు.ఐ, యువజన కాంగ్రెస్ అధ్యక్షులు, నాయకులు, సోషల్ మీడియా కోఆర్డినేటర్లు, మరియు అధిక సంఖ్యలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App