On the one hand, TTD Shanti Homa was held in Tirumala temple on the use of adulterated ghee
Trinethram News : Andhra Pradesh : కల్తీ నెయ్యి వాడకంపై ఒకవైపు తిరుమల ఆలయంలో టీటీడీ శాంతి హోమం నిర్వహించగా.. మరోవైపు ఈ వివాదం రాజకీయంగా రాజుకుంది. టీటీడీ చైర్మన్‌గా తనపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో భూమన కరుణాకరరెడ్డి సోమవారం తిరుమలకు వెళ్లారు. రాజకీయ ప్రసంగం చేయకూడదని పోలీసులు నోటీసులివ్వగా సంతకం చేశారు. ఎంపీ గురుమూర్తి, కుమారుడు అభినయ్‌రెడ్డితో కలిసి వెళ్లిన ఆయన శ్రీవారి పుష్కరిణిలో స్నానం చేసి బేడి ఆంజనేయస్వామిని దర్శించుకున్నారు.
అఖిలాండం వద్ద హారతి ఇచ్చే క్రమంలో ప్రార్థన చేస్తున్నట్లుగా.. రాజకీయ వ్యాఖ్యలు చేశారు. వెంటనే పోలీసులు అడ్డుకుని బలవంతంగా తిరుపతికి పంపారు. నిబంధనలు ఉల్లంఘించారని వివిధ సెక్షన్ల కింద ఆయనపై కేసు నమోదైంది కూడా. ఈ వివాదం కేంద్రంగా రాజకీయ వేడి రాజుకుంది. భూమన ప్రమాణాన్ని నిరసిస్తూ టీడీపీ నేతలు తిరుపతిలో గోవిందనామాలతో శ్రీవారిని ప్రార్థించారు. మరోవైపు భవిష్యత్తులో ఇలాంటి అపచారాలు జరగకూడదని శ్రీవారి ప్రార్థిస్తూ తిరుమలలో టెంకాయలు కొట్టారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App