హనియ మొదటి జన్మదినo సందర్భంగా విద్యార్థులకు పుస్తకాలు పెన్నులు అందజేత
వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ వికారాబాద్ పట్టణానికి చెందిన,పిలిగుండ్ల పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఎండి. మోసిన్ కుమార్తె హానియ మొదటి జన్మదినం సందర్భంగా శుక్రవారం జిల్లా కేంద్రంలోని అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాలలోని విద్యార్థులకు నోట్ పుస్తకాలు, పెన్నులు,పెన్సిల్లు అందజేయడం జరిగింది.ఈ సందర్భంగా పాఠశాల ఎస్ఓ దుద్యాల వీరేశం మాట్లాడుతూ.. ప్రార్ధించే పెదాల కన్నా సాయం చేసే చేతులు మిన్న అని పాఠశాల విద్యార్థుల అవసరాన్ని గ్రహించిన పిలి గుండ్ల ప్రధానోపాధ్యాయులు తన కూతురు పుట్టిన రోజూ వృధా ఖర్చులకు పోకుండా పేద విద్యార్థులకు నోటు పుస్తకాలు అందించి ఉదారత చాటారన్నారు.అనంతరం మోసిన్ మాట్లాడుతూ…
తాను కూడా ప్రభుత్వ పాఠశాలలోనే చదువుకోవడం జరిగిందని గుర్తు చేశారు.చదువును కష్టంగా కాకుండా ఇష్టంగా చదువుకోవాలని విద్యార్థులకు సూచించారు.అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాలలో ఈ కార్యక్రమం నిర్వహించడం తనకెంతో సంతృప్తినిచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో కడిచర్ల ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు బి.అశోక్, జర్నలిస్ట్ అరుణ్ రెడ్డి పన్నాల,రాజు, ఆరిఫ్ లు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App