TRINETHRAM NEWS

చంద్రగిరి శ్రీనాథ్ జన్మదినం సందర్బంగా

తబితా ఆశ్రమంలో పిల్లలకు రగ్గులు పంపిణి చేసి అన్నదానం చేసిన కుటుంబ సభ్యులు

గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

గోదావరిఖని ప్రాంతంలోని విఠల్ నగర్ నివాసి అయిన యువకుడు చంద్రగిరి శ్రీనాథ్ ఇటీవల గుండె పోటుతో మృతి చెందడం జరిగిందని, నేడు శ్రీనాథ్ జన్మదినం సందర్బంగా వారి జ్ఞాపకార్ధం కొరకు రామగుండం తబితా ఆశ్రమంలోని పిల్లలందరికి కుటుంబ సభ్యులు మద్దెల దినేష్ సౌజన్య రగ్గులు అందజేసి అనంతరం భోజనాలు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.
అనంతరం మద్దెల దినేష్ సౌజన్య మాట్లాడుతూ
చంద్రగిరి శ్రీనాథ్ కల్మషం లేని వ్యక్తి అని అందరితో మంచిగా ఉండే వాడని, సమాజాన్ని ప్రేమించేవాడని, ముఖ్యంగా నిరాశ్రాయులకు, నిరుపేదలకు, అన్నర్థులకు నిరంతరం తన వంతు సహాయ సహకారాలు అందించేవారని, తబితా ఆశ్రమంతో వీడదియని అనుబంధం అని అలాంటి వ్యక్తి ఆయన శ్రీనాథ్ మన మధ్య లేకపోవడం బాధాకరమన్నారు. ప్రతి ఏటా తన జన్మదినాన్ని పురస్కరించుకొని సేవ కార్యక్రమాల చేసుకునే వాడని ఈసారి జన్మదినం రోజున మన మధ్య లేకపోవడంతో కుటుంబ సభ్యులంతా దుఃఖసాగరంలో మునుగిపోయారన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App