హోం మంత్రి అమిత్ షా దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని ఆదివాసి గిరిజన సంగం పక్షాన డిమాండ్ చేస్తున్నాం.
అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు వేలి మండలం త్రినేత్రం న్యూస్ డిసెంబర్.20:
అరకు వేలి ఆదివాసీ గిరిజన సంఘం భవనంలో ఆదివాసీ గిరిజన సంఘం మండల కార్యదర్శి గత్తుం బుజ్జి బాబు మాట్లాడుతూ పార్లమెంట్ లో భారత ముద్దు బిడ్డ అణగారిన వర్గాలకు యావత్ దేశ ప్రజాలు అభిమానించే నాయకుడు మేధావి భారత రాజ్యాంగ నిర్మాత భారత రత్న గ్రహీత అయినట్టు వంటి డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ మీద అవమానకార వ్యాఖ్యలు చేసిన హోమ్ మంత్రి అమిత్ షా క్షమపణలు చెప్పాలి.హోమ్ మంత్రి పదవికి రాజీనామా చేయాలి అని.
ఈ రోజు గిరిజన ప్రాంతంలో ప్రత్యేక చట్టాలు ఉన్నాయి అంటే అది అంబేద్కర్ కృషి వలెనే చట్టాలు వచ్చాయని అటువంటి ప్రపంచం గుర్తించినట్టు వంటి మేధావి పై ఇటువంటి అమానుష వ్యాఖ్యలు చేసి మాట్లాడటం దేశ ప్రజాలను మత కోణంలో విభజించ డానికేనని దానికి మన దేశ ప్రధాని ఖండించాల్సింది పోయి, వెనకేసుకొని రావడం ఛిగ్గు చేటు అని, దీనిని ఆదివాసీ గిరిజన సంఘం అరకువేలి మండల కమిటీ తీవ్రంగా ఖండిస్తుంది. అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ గిరిజన సంఘం నాయకులు జి. సత్యరావు, వి. బుద్రయ్య పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App