27న హైదరాబాద్ కమిషనర్ ఆఫ్ ఫ్యామిలీ వెల్ఫేర్ రాష్ట్ర కార్యాలయానికి ఎన్ హెచ్ ఎం ఉద్యోగులు రాగలరని పిలుపునిచ్చారు.
ఏ.ఐ.టీ.యూ.సీ రాష్ట్ర కౌన్సిల్ మెంబర్, జాతీయ ఆరోగ్య మిషన్ కాంట్రాక్ట్ అండ్ ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ రాజేష్ ఖన్నా ఏఐటియుసి అనుబంధం
25 నవంబర్ 2024
హనమకొండ జిల్లా త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
ఈ నెల బుధవారం రోజున 27 నవంబర్ మధ్యాహ్నం 12 గంటలకు కమిషనర్ ఆఫ్ ఫ్యామిలీ వెల్ఫేర్ హైదరాబాద్ రాష్ట్ర కార్యాలయానికి జాతీయ ఆరోగ్య మిషన్ క్యాడర్ ఒక్కరు చొప్పున రాగలరు. ఏ.ఐ.టి.యూ.సి ఆధ్వర్యంలో కార్మికుల హక్కుల సాధనకై నిర్వహించే కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఏ.ఐ.టీ.యూ.సి ఉప ప్రధాన కార్యదర్శి మరియు జాతీయ ఆరోగ్య మిషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం. నరసింహ, కాంట్రాక్ట్ అండ్ ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ యూనియన్ ఎన్ హెచ్ ఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ రాజేష్ ఖన్నా పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… ఎన్.హెచ్.ఎంలో వివిధ బాగాల్లో 78 క్యాడర్స్ లో పని చేస్తున్న 17514 ఉద్యోగులను అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, జాతీయ ఆరోగ్య మిషన్ ఆల్ క్యాడర్స్ ఉద్యోగుల సమస్యల శాశ్వత పరిష్కారం కొరకు హాజరు కావాలన్నారు. ప్రతి జిల్లా నుంచి ప్రతి క్యాడర్ నుండి ఒక్కరు చొప్పున 78 క్యాడర్స్ ఉద్యోగులు పాల్గొనాలని, జయప్రదం చేయాలని ఉద్యోగులకు పిలుపునిచ్చారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App