TRINETHRAM NEWS

12 వ తేది బంధు కు పీవీటీజీ గ్రామాల్లో విశృత ప్రచారం
ఎస్ఎఫ్ఐ మండల కమిటీ సభ్యుడు ఐస్ బాబూ !!

అల్లూరిజిల్లా, అరకు లోయ త్రినేత్రం, న్యూస్ ఫిబ్రవరి 9: ఆంధ్ర ప్రదేశ్ శాసనసభాపతి చింతకాయల అయ్యన్న పాత్రుడు 1/70భూబదాలయింపు నిషేధ చట్టం సవరణ చెయ్యాలన్న వివాదస్పదమైన వ్యాఖ్యలపై రాష్ట్ర వ్యాప్త ఏజెన్సీ బంద్ ఈ నెల 12 వతారీఖునని ఆంధ్ర ప్రదేశ్ ఆదివాసీ గిరిజన సంఘం మండల కమిటీ సభ్యుడు ఐస్ బాబూ స్పష్టం చేసారు. ఆంధ్రప్రదేశ్ ఆదివాసి జెఎసి రాష్ట్ర మరియు జిల్లా కమిటీలు సుదీర్ఘ చర్చల అనంతరం ఈ నెల 12వ తేదిన ఒక్కరోజు మన్యం బంద్ కు పిలుపునివ్వడం జరిగింది. దానికి అనుబంధంగా అన్ని రాజకీయ పార్టీల నాయకులు ఏక తాటిపైకి వచ్చి అఖిలపక్ష మీటింగ్ పెట్టి పిబ్రవరి 11, 12 తేదీలలో రెండు రోజులు బంద్ కు పిలుపు ఇచ్చినట్లు మీడియా ద్వారా తెలియవచ్చింది. అందరు ఏక తాటిపైకి రావడాన్ని ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ గిరిజన సంఘం స్వాగతిస్తుంది.

అయితే ఆంధ్రప్రదేశ్ ఆదివాసి నాయకులు సుదీర్ఘంగా చర్చించి, కరపత్రాల, గోడ పత్రికలు, బ్యానర్లు కూడా ముద్రించడం జరిగింది. జెఏసి జిల్లా కమిటీలతో సమన్వయ పరిచి తీసుకున్న పిబ్రవరి 12 వ తేదిన ఒక్క రోజు బంద్ కార్యక్రమంలో ఏవిధమైన మార్పు లేదు. కావున ఆదివాసీ సభ్యులు పిబ్రవరి 12 వ తేదిన ఒక్క రోజు బందు విజయవంతం చేయడానికి సమాయత్తం కావాలనీ, ఈ యొక్క బంద్ నీ జయప్రదం చేయాలని కోరారు. గిరిజన సంఘం మండల కమిటీ సభ్యులు ఎస్ ఐసుబాబు మరియు గ్రామస్థులు బురిడీ బుచ్చన్న,గెమ్మెలి సంతోష్ కుమార్ బి.సుబ్బారావు మరియు కే.గాసీ,బి.రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Bandh