TRINETHRAM NEWS

Officials should not take leave.. If you apply for leave, cancel it: CM Revanth Reddy

Trinethram News : తెలంగాణ : తెలంగాణలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలపై సీఎం రేవంత్ రెడ్డి అత్యవసర సమీక్ష నిర్వహించారు. కలెక్టర్లు, ఎస్పీలు, రెవెన్యూ, ఇరిగేషన్, మున్సిపల్ అధికారులు 24 గంటలు క్షేత్రస్థాయిలో పర్యటించాలి. అధికారులు సెలవులు పెట్టొద్దు. లీవ్ అప్లై చేసిన వారు వెంటనే రద్దు చేసుకొని పనుల్లో నిమగ్నం కావాలి. అత్యవసర విభాగాల అధికారులు క్షేత్రస్థాయి సమాచారాన్ని ఎప్పటికప్పుడు సీఎంవోకు అందించాలి’ అని సీఎం ఆదేశించారు. వరద ఎఫెక్ట్ ఏరియాల్లో తక్షణ సహాయం కోసం చర్యలు చేపట్టాలన్నారు సీఎం రేవంత్.

అత్యవసర పనుకుంటే తప్పా ప్రజలు బయటకి రావొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న సీఎం.. ఏ అవసరం ఉన్నా అధికారులకు ఫోన్లో సమాచారం ఇవ్వాలని సూచించారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు స్థానికంగా ఉంటూ సహాయక కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు. 24 గంటలు అలెర్ట్ గా ఉంటూ సహాయ కార్యక్రమాల్లో భాగంగా కావాలని కాంగ్రెస్ కార్యకర్తలకు సీఏం సూచించారు. సీనియర్ మంత్రులు భట్టి, ఉత్తమ్, పొంగులేటి, తుమ్మల, దామోదర రాజనర్సింహ, జూపల్లి తదితరులతో ఫోన్లో రివ్యూ చేసి అప్రమత్తం చేశారు సీఎం రేవంత్

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Officials should not take leave.. If you apply for leave, cancel it: CM Revanth Reddy