
రెండు సంవత్సరాలగా మంచం మీదే ఉంటున్నాడు
కూటమి ప్రభుత్వం కనికరించాలి
బ్రెయిన్ ట్యూమర్ వచ్చి రెండేళ్లుగా మంచం మీదే జీవచ్చవంగా పడి ఉన్నాడు.నెలనెలా మందులకే వేలాది రూపాయలు ఖర్చు అవుతున్నాయి. అటువంటి వ్యక్తికి పించను మంజూరు చేయడానికి అధికారులకు దయకలగడం లేదు.కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇటువంటి వారికి వెంటనే నెలకు రూ.15 వేలు మంజూరు అవుతున్నాయి. కానీ ఈయన విషయంలో మాత్రం అధికారులు పగబట్టినట్లుగా ప్రవర్తిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.
వివరాల్లోకెళ్తే తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం జేగురుపాడు గ్రామానికి చెందిన నాగిరెడ్డి సత్తిబాబు అనే 40 సంవత్సరాల యువకుడుకి దురదృష్టవశాత్తు బ్రెయిన్ ట్యూమర్ వచ్చింది. అప్పటినుంచి మంచం పైనే కదలలేని పరిస్థితుల్లో జీవిస్తున్నాడు. వ్యవసాయ కూలి కుటుంబానికి చెందిన వారు కావడంతో మందులతో వైద్యం చేయించడం భారంగా మారింది. ఇటువంటి పరిస్థితుల్లో కనీసం బెడ్ రీడ్ పేషంట్లకు ఇచ్చే నెలకు రూ.15 వేలు పింఛను మంజూరైన కొంత వెసులుబాటు ఉంటుందని ప్రయత్నిస్తున్నారు.
ఈయన కుటుంబ సభ్యులు ఎంత ప్రయత్నించినా వైద్య అధికారులు మాత్రం ఎందుకో స్పందించడానికి ఇంకా సమయం రావడం లేదని కుటుంబ సభ్యులు వాపోతున్నారు. ఊరంతా ఇతని పరిస్థితి చెప్పడంతో రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చియ్య చౌదరి కూడా సత్తిబాబు ఇంటికి వెళ్లి స్వయంగా చూసి చలించి పోయారు. వెంటనే పింఛను వచ్చే ఏర్పాటు చేయాలని ఎంపిడివో రమేష్ కు సూచించారు. వైద్య అధికారులతో కూడా ఫోన్ లో మాట్లాడారు.అయినా పింఛను మంజూరు కాలేదు. అంతకు ముందు నుంచే పించను కోసం వీరు చేయని ప్రయత్నం లేదు.ఆ గ్రామ ఎంపిటీసి నాగిరెడ్డి సూర్య రామకృష్ణ రోజూ ఇతని పరిస్థితిని అధికారులకు తెలియజేస్తూనే ఉన్నారు. ప్రతీ నెల పించను పంపిణీ జాబితాలో పేరు వస్తుందని ఎదురు చూడటం… రాలేదని తెలుసుకుని నిరుత్సాహ పడటం ఆ కుటుంబానికి ఆనవాయితీగా మారింది.
సత్తిబాబులో కదలలేని పరిస్థితిలో ఉన్నందున కుటుంబ సభ్యులు అతని ఫోటోలు,వీడియోలు తీసుకుని అధికారులకు మొరపెట్టుకున్నా ఆలకించే వారే కరువయ్యారు. సధరం సర్టిఫికెట్ ఉంటే వెంటనే పింఛను వస్తుందని చెప్పడంతో అతి కష్టం మీద కాకినాడ గవర్నమెంట్ హాస్పిటల్‌కి తీసుకెళ్లి వైద్య పరీక్షలు చేయించారు. అక్కడ 90 శాతం వైకల్యాన్ని గుర్తించి ధృవపత్రం ఇచ్చారు.అయినా పింఛను మాత్రం మంజూరు కాలేదు. ప్రస్తుతం అతను శరీర భాగాలలో ఎలాంటి కదలలేక లేవు.బడికి వెళ్లే ఇద్దరు చిన్నారులతో ఓపక్క ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటూ మరోపక్క మంచానికే పరిమితమై భర్త ఆరోగ్య పరిస్థితులను చూసుకుంటూ సత్తిబాబు బార్య చక్రవేణి కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
సత్తిబాబు కుటుంబ పరిస్థితిని గమనించిన వారంతా మీకు తెలిసిన గ్రూప్ ల ద్వారా పాలకులు, అధికారులకు చేరేలా షేర్ చెయ్యండి.మానవత్వంతో మనం చేసే ఈ ప్రయత్నం ఖచ్చితంగా ఫలించి ఏప్రిల్ నెలలో పింఛను మంజూరవుతుందని ఆశిద్దాం..
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
