TRINETHRAM NEWS

కల్లులో కలిపే కల్తి మందును పట్టుకున్న జిల్లా టాస్క్ ఫోర్స్ అధికారులు

వికారాబాద్ జిల్లా ప్రతినిధిత్రినేత్రం న్యూస్
కల్తీ కల్లు తయారీకి ఉపయోగించే 20 కేజీల క్లోరల్ హైడ్రేట్ కిమికల్ ను పట్టుకున్న జిల్లా టాస్క్ ఫోర్స్ అధికారులు. – జిల్లా ఎస్పీ శ్రీ కె. నారాయణ రెడ్డి, IPS.
నమ్మదగిన సమాచారం మేరకు జిల్లా టాస్క్ ఫోర్స్ మరియు కొడంగల్ పోలీస్ అధికారులు కొడంగల్ చౌరస్తాలో వాహనాల తనిఖీ చేస్తున్నా సమయంలో ఒక స్విఫ్ట్ కార్ అపకుండా వెళ్ళిపోతుండగా పోలీస్ అధికారులు ఆ వాహనాన్ని అపి ఆ వాహన డ్రైవర్ ను విచారించి గా అట్టి డ్రైవర్ పేరు అంబరపేట శ్రీకాంత్ గౌడ్, తండ్రి శ్రీనివాస్ గౌడ్, బషీరాబాద్ గ్రామం మరియు మండలం వికారాబాద్ జిల్లా అని తెలియజేయడం జరిగింది. వాహనంలో తనిఖీలు చేయగా అందులో కల్తీ కల్లు తయారీకి ఉపయోగించే క్లోరల్ హైడ్రేట్ 10 కేజీ లు స్వాధీనం చేసుకోవడం జరిగింది.నిందితుడినివిచారించగ తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలనే లక్ష్యంతో కల్తీ కల్లు తయారుచేసి విక్రాయించడం జరుగుతుంది. ఇట్టి కెమికల్ ను తను కర్ణాటక రాష్ట్రం చించోలి కి చెందిన మేఘనాధ్ గౌడ్, బషీరాబాద్ మండలం వాస్తవ్యుడు అయిన నగేష్ గౌడ్ దగ్గర కొనడం జరుగుతుందిఅనితెలియజేయడం జరిగింది. మేఘనాధ్ గౌడ్ ను అదుపులోకితీసుకోనివిచారించగా అతను చితపూర్ కు చెందిన ఉష్ణయ్య గౌడ్ దగ్గర ఇట్టి కిమికల్ ను కొనడం జరుగుతుంది అని తెలిపినాడు.మేఘనాధ్ గౌడ్ దగ్గరి నుండి 5 కేజీలు, ఉష్ణయ్య గౌడ్ దగ్గరి నుండి 5 కేజీలు క్లోరల్ హైడ్రేట్ ను స్వాధీనం చేసుకోవడం జరిగింది. మొత్తం ఇట్టి కేసులో సుమారు 60,000 రూపాయల విలువగల 20 కేజీ ల క్లోరల్ హైడ్రేట్ ను స్వాధీనం చేసుకోవడం జరిగింది.మరియు ఇట్టి కేసులోని నిందితులపైన కొడంగల్ పోలీస్ స్టేషన్ నందు కేసు నమోదు చేసి నిందితులను రిమాండ్ చేయడం జరిగింది. ఇట్టి క్లోరల్ హైడ్రేట్ కిమికల్ కలిపి తయారు చేసిన కల్లును సేవించడం వలనసేవించిన వ్యక్తులకు మత్తు కల్గించడమే కాకుండా, మెదడు, ఇతర శరీర బాగాల మీద ప్రభావం చూపి అనారోగ్యం కల్పించడం జరుగుతుంది. ఇట్టి కల్తీ కల్లును ఒక సారి సేవించిన వారికీ ఇది ఒక డ్రగ్ లాగ అలవాటుపడి దానికే బానిస అయిపోతారు. దయచేసి ప్రజలు ఇట్టి కల్తీ కల్లు పైన అవగాహనాఏర్పాటుచేయనుకోని ఎవరుకూడ కల్తీ కల్లును చెవించవద్దు అని ఎక్కడైనా కల్తీ కల్లుకు సంబంధించినసమాచారం ఉంటే వెంటనేపోలీస్అధికారులకు సమాచారం అందించాలని జిల్లా ఎస్పీ తెలియజేయడం జరిగింది.
జిల్లాలో ఎవరైనా ఇట్టి కెమికల్ ను ఉపయోగించి కల్తీ కల్లు తయారు చేసిన, గంజాయి లాంటి మత్తు పదార్థాల వ్యాపారం చేసిన కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మత్తు పదార్థాల వ్యాపారాలు, కల్తీ వ్యాపారాలు, అక్రమ రవాణా లు , అసాంఘిక కార్యకలాపాలు చేస్తే కఠినమైన చర్యలుతీసుకోవడంజరుగుతుంది. టాస్క్ ఫోర్స్ అధికారులతో జిల్లా వ్యాప్తంగా నిఘా పెట్టడం జరుగుతుంది అని జిల్లా ఎస్పీ తెలియజేయడం జరిగింది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App