TRINETHRAM NEWS

శ్రీశైలంలో డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు మెరుపు దాడులు చేశారు.
Trinethram News : శ్రీశైలం : సముద్ర గర్భంలో లభించేటటువంటి కోరల్స్ జాతికి చెందిన వాటిని సేకరించి, వాటిని విక్రయిస్తున్నట్లుగా సమాచారం అందడంతో డైరెక్ట్ రేట్ అఫ్ రెవిన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు దాడులు చేసినట్టుగా తెలుస్తోంది.

కర్ణాటకలో ఈ ముఠాకు సంబంధించిన కొందరు నిందితులు అందించిన సమాచారంతో ఒంగోలు నంద్యాల జిల్లాల్లో దాడులు నిర్వహించారు.
శ్రీశైలంలో వీటి విక్రయాలు జరుగుతున్న దుకానాలపై దాడులు చేసి సున్నిపెంటకు చెందిన వెంకట రమన,( ఆటో డ్రైవర్) రామాంజనేయులు అనే ఇద్దరిని అదులులోకి తీసుకొని రిమాండ్ చేసినట్లుగా అధికారులు తెలిపారు.

సముద్ర భూగర్భంలో ఉండే ఈ జీవరాశులను సేకరించటం అన్నది వైల్డ్ లైఫ్ ఆక్ట్ ప్రకారం నేరమని పులులు సింహాలు జింకలు లాంటి మృగాలను వేటాడితే ఎలాంటి చట్టాలు వర్తిస్తాయో ఆ చట్టాల కింద కేసులు నమోదు చేసి శిక్షించడం జరుగుతుందని అధికారులు తెలుపుతున్నారు.
వీటిని ఇంద్రజాలం, దృష్టి ఆకర్షణ పేరుతో ప్ర్రేమ్స్ వేసి అమ్మకాలు జరుపుతున్నట్టు సమాచారంతో దాడులు జరిపినట్టు స్థానిక ఫారెస్ట్ అధికారులు తెలిపారు….

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App