TRINETHRAM NEWS

OC-2 GM, Singareni officials ignoring Siddapally mineral water plant

మంథని మండలం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

మంథని మండలం సిద్దపల్లి గ్రామం లో సింగరేణి కాలరీస్ CSR నిధులతో ఏర్పాటు చేసిన మినరల్ వాటర్ ప్లాంట్ ను పట్టించుకోని సింగరేణి అధికారులు. పలుమార్లు సింగరేణి అధికారులకు మరియు ఓసీ -2 జీఎం కి చెప్పిన కూడా పట్టించుకోని వైనం . ఓసీ -2 జీఎం కి చెప్పగా తప్పకుండ మినరల్ వాటర్ ప్లాంట్ బాగు చేయిస్తాం అని చెప్పి 2 నెలలు అవుతున్న కూడా వచ్చి చుసిన వాళ్ళు లేరు.గ్రామాల్లో నివసిస్తున్నా ప్రజలు మినరల్ వాటర్ కోసం 6 కిలోమీటర్లు వెళ్తున్నారు.

సింగరేణి లో భూములు కోల్పోయి సర్వం సింగరేణి కి సమర్పించిన ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్న పట్టించుకోని వైణం.ఓసీ -2 జీఎం కి ఎన్ని సార్లు చెప్పిన పట్టించుకోవడం లేదు అని, వివిధ పత్రికల వార్తల ద్వారా కూడా చెప్పిన పట్టించుకోవడం లేదు, చూసి చూడనట్టు గా ఉంటున్న అధికారులు. ఈ వర్షాకాలం లో ఇంకా అనేక ఇబ్బందులు పడుతున్నాం అని, సిద్దపల్లి నుండి 6కిలోమీటర్లు వెళ్లాల్సిన పరిస్థితి ఉన్నది అని గ్రామ ప్రజలు వాపోతున్నారు. ఇక నైనా సింగరేణి అధికారులు వాటర్ ప్లాంట్ ని సందర్శించి ప్లాంట్ మరమ్మతులు చేయించాలని అని ప్రజలు కోరుతున్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

OC-2 GM, Singareni officials ignoring Siddapally mineral water plant