గోపాలపురం, తేదీ:15.2.2024
తాత్కాలిక స్ట్రాంగ్ రూమ్ వద్ద కట్టుదిట్టమైన భద్రత చర్యలు తీసుకోవాలి
స్ధానిక పోలింగ్ కేంద్రం వద్ద బీఏల్వో పేరు ఫోన్ నెంబర్ తప్పని సరి
జిల్లా ఎన్నికల అధికారి/ కలెక్టర్ మాధవీలత
సార్వత్రిక ఎన్నికల నిర్వహణ కోసం వినియోగించే ఈ వి ఎమ్ అనుబంధ యూనిట్స్ , పొలింగ్ మెటీరియల్ భద్ర పరిచి , పోలింగ్ సామాగ్రి పంపిణి కి సమగ్ర కార్యాచరణకు సిద్దం చేసుకొవాలని కలెక్టర్ , జిల్లా ఎన్నికల అధికారి కె. మాధవీలత ఆదేశించారు.
గురువారం ఉదయం స్థానిక నియోజక వర్గం కోసం ప్రతిపాదించిన డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని , స్ట్రాంగ్ రూమ్ ను రిటర్నింగ్ అధికారి కే . శివ జ్యోతి , ఇతర అధికారులతో కలసి కలెక్టర్ పరిశీలించారు. ఈ సంధర్భంగా జిల్లా ఎన్నికల అధికారి / కలెక్టర్ కె. మాధవీలత మాట్లాడుతూ, ఎన్నికల నిర్వహణ , ఓటింగ్ ప్రక్రియ సజావుగా నిర్వహించే క్రమంలో ఏర్పాట్లు పకడ్బందీగా నిర్వహించేందుకు సన్నాహాల లో భాగంగా గోపాలపురం డా బి ఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల ను నియోజక వర్గం పరిధిలో పరిశీలించినట్లు తెలిపారు. ఈ కేంద్రం నుంచి గోపాలపురం నియోజక వర్గంలో ఉన్న అన్ని పోలింగ్ కేంద్రాలకు పార్లమెంట్ , అసెంబ్లీ నియోజక వర్గాలకు చెందిన ఈవిఎమ్ పరికరాలు, ఇతర పోలింగ్ మెటీరియల్ పంపడం జరుగుతుందనీ అన్నారు . ఇందుకోసం అనువైన భవనాన్ని ఎంపిక చేయటం, అదే ఆవరణలో తాత్కాలిక స్ట్రాంగ్ రూమ్ కూడా ఏర్పాటు చేస్థున్నట్లు తెలియ చేశారు. స్ట్రాంగ్ రూమ్ నుంచి పోలింగ్ కేంద్రాల వారీగా సెక్టర్ల ను ఏర్పాటు చేసి, ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులకి వాటినీ అప్పగించడం జరుగుతుందనీ అన్నారు. ఇందుకు అనుగుణంగా రూట్ మ్యాప్ ప్రకారం ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు. పార్లమెంట్, అసెంబ్లీ లకీ చెందిన బ్యాలెట్ యూనిట్స్ కమీషనింగ్ కోసం ప్రత్యేక గదులను కేటాయించి ఆమేరకు చర్యలు తీసుకోవాలని సూచించారు.
పోలింగ్ కేంద్రం వివరాలూ, బి ఎల్ వో పేరు, ఫోన్ నెంబర్ పోలింగ్ కేంద్రం రూమ్ వద్ద, అదేవిధంగా స్కూల్ ఆవరణ లోనికి ప్రవేశించే గోడమీద ఆ కేంద్రం లోని మొత్తం పి ఏస్ వారీగా బీఎల్ వో పేరు వివరాలు, ఫోన్ నెంబర్ లను ప్రదర్శించాలన్నారు
కలెక్టర్ వెంట అనపర్తి ఆర్ వో కే . శివ జ్యోతి, డిప్యూటీ తహసీల్దార్ ఎస్. కృష్ణా, వసతి గృహం అధికారులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి, రాజమహేంద్రవరం వారిచే జారీ.