TRINETHRAM NEWS

Trinethram News : ఈనెల మార్చి 18వ తేదీ నుంచి పదవ తరగతి పరీక్షలు ప్రారంభం అవుతున్న సందర్భంగా ఫీజుల పేరుతో హాల్ టికెట్లు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నా కళాశాలపై విద్యాశాఖ అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలి. అని NSUI జిల్లా నాయకులు మంజునాథ్ డిమాండ్ ఈ సందర్భంగా అనంతపురం నగరంలో మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ
పదవ తరగతి పరీక్షలు నేపథ్యంలో అనంతపురం నగరంలో అన్ని పరీక్ష కేంద్రాల్లో మౌలిక వసతులు కల్పించాలని అన్నారు. అదేవిధంగా ప్రైవేట్, కార్పొరేట్ కొన్ని కళాశాలలో విద్యార్థులకు ఫీజుల పేరుతో హాల్ టికెట్లు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారనీ, అలాంటి కళాశాలలపై వేంటనే విద్యాశాఖ అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు అదేవిధంగా పరీక్ష కేంద్రాల్లో త్రాగునీరు, ఫ్యాన్లు, ఫర్నిచర్ ఉండేలా చూడాలన్నారు. ఎండ తీవ్రతను దృష్టిలో పెట్టుకుని కేంద్రాల దగ్గర వైద్య ఆరోగ్య సిబ్బంది అందుబాటులో ఉంచాలన్నారు. విద్యార్థులు రవాణా శాఖ వల్ల ఇబ్బందులు పడకుండా ఆర్టీసీ అధికారులు స్పందించి విద్యార్థుల సౌకర్యార్థం సమయానికి బస్సులు ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు…