ఆదివాసీ ఉద్యోగాలు దోపిడీ పరంపర!పాడేరు వైద్య కళాశాల నోటిఫికేషన్…
స్థానికులకే చెందాలని గిరిపుత్రుల విన్నపాలు!
అల్లూరిజిల్లా అరకులోయ, త్రినేత్రం, న్యూస్ ఛానల్ రిపోర్టర్, జనవరి 24.
పాడేరు మెడికల్ కళాశాలలో నోటిఫికేషన్ విడుదల చేసిన 244 ఉద్యోగాలు స్థానిక ఆదివాసులచేతనే భర్తీకి చర్యలు తీసుకోవాలి. పాడేరు మెడికల్ కళాశాలలో గిరిజనేతరులకు కేటాయించిన పోస్టులు తక్షణమే రద్దు చెయ్యాలి.
షెడ్యూల్ ప్రాంతంలో జివో నంబర్ 3 రద్దవ్వడంతో పాడేరు మెడికల్ కళాశాలలో,ఏకలవ్య స్కూల్స్, ఐ, సి డి ఏస్ తదితర శాఖల్లో గిరిజనేతరులతో భర్తీ చెయ్యడంతో స్థానిక ఆదివాసులకు తీవ్ర అన్యాయం జరుగుతుంది.
రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే పాడేరు మెడికల్ కళాశాలలో వందశాతం పోస్టులను స్థానిక ఆదివాసుల ద్వార భర్తీ చెయ్యాలని, గిరిజనేతరులకు కేటాయించిన పోస్టులను రద్దు చేయాలని, ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కిల్లో సురేంద్ర డిమాండ్ చేశారు.
ఆదివాసీలు జివో నంబర్ 3 రద్దుతో తీవ్ర అన్యాయం జరుగుతున్నందున షెడ్యూల్ ప్రాంతంలో వంద శాతం ఉద్యోగ,ఉపాధ్యాయ నియామక చట్టం చెయ్యాలని ఆదివాసీ గిరిజన సంఘం డిమాండ్ చేస్తుంది, లేని ఎడల ఆందోళనకు సిద్ధం అవ్వాలని ఆదివాసీ యువతకు పిలుపిచ్చారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App