TRINETHRAM NEWS

తూర్పు సముద్రంలోకి ఉత్తర కొరియా క్షిపణుల ప్రయోగం

Trinethram News : ఉత్తర కొరియా : Jan 06, 2025,

ఉభయ కొరియా దేశాల మధ్య ఎన్నోఏళ్లుగా ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఉత్తర కొరియా తూర్పు సముద్రంలోకి బాలిస్టిక్‌ క్షిపణులు ప్రయోగించింది. ఈ మేరకు దక్షిణ కొరియా పేర్కొంది. 2025లోనూ ఉత్తర కొరియా ఆయుధ పరీక్షలను కొనసాగిస్తోందని ద సౌత్‌ జాయింట్‌ చీఫ్స్‌ ఆఫ్‌ స్టాఫ్‌ తెలిపారు. అయితే ఎన్ని క్షిపణులు ప్రయోగించింది.. అవి ఎంత దూరం వెళ్లింది మాత్రం స్పష్టంగా వెల్లడించలేదు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App