TRINETHRAM NEWS

మంగళగిరిలో నారా లోకేష్ నాన్ స్టాప్ సంక్షేమం

చిరు వ్యాపారుల జీవనోపాధికి అండగా నిలుస్తున్న నారా లోకేష్

మంగళగిరి పట్టణంలో చిరు వ్యాపారుల జీవనోపాధి కోసం నారా లోకేష్ సహకారం తో 11 టిఫిన్ బండ్లు, 12 తోపుడుబళ్ళ ను, అందజేసిన టీడీపీ నాయకులు

మంగళగిరి, జనవరి 14 : మంగళగిరి పట్టణంలో చిరు వ్యాపారుల జీవనోపాధికి అండగా నిలిచేలా నారా లోకేష్ సహకారంతో ఆదివారం సాయంత్రం స్థానిక శ్రీ మార్కండేయ పద్మశాలీయ కళ్యాణ మండపం వద్ద మంగళగిరి పట్టణ అధ్యక్షులు దామర్ల రాజు ఆధ్వర్యంలో చిరు వ్యాపారులకు పెద్ద ఎత్తున టిఫిన్ మరియు తోపుడుబళ్లను టీడీపీ నాయకులు అందజేశారు.మంగళగిరికి చెందిన బెల్లంకొండ చిరంజీవి, చిట్టిప్రోలు మల్లేశ్వరి,జగన్నాథం తులసి, కాకుమాను చెన్నప్ప, మర్రి విజయలక్ష్మి, పంది శ్రీదేవి,ఫణిదపు శివలీల, పెండం వెంకటేశ్వరమ్మ, షేక్ మహబూబి,తాడిపర్తి లక్ష్మి, ఉద్ధంటి జయశంకర్ లకు టిఫిన్ బండ్లు ను,బాణాల వెంకట్రావు, చింతపండు వెంకటసుబ్బయ్య, గంజి శివ గోవిందరావు, గుడిపూడి సుశీల, జోగా పద్మ, మల్లెల నాగలక్ష్మి, మన్యం జగదీశ్వరి, పల్లపు దుర్గ నాగలక్ష్మి,షేక్ దస్తగిరి, షేక్ ఇస్మాయిల్, తన్నీరు రమణ, నారా దుర్గా లకు తోపుడు బండ్లు ను అందజేశారు. తమ జీవనోపాధి కోసం టిఫిన్ బండ్లను, తోపుడుబళ్లను అందజేయాలన్న అభ్యర్థన మేరకు వారి వారి అభ్యర్థులను పరిశీలించి ఈ రోజు వారికి బండ్లను అందజేశారు.
ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షులు దామర్ల రాజు మాట్లాడుతూ నారా లోకేష్ గత నాలుగున్నరేళ్లుగా అన్ని వర్గాల ప్రజల కోసం సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ ప్రజల మన్ననలు పొందుతున్నారని అన్నారు. నియోజకవర్గంలో ప్రజల దాహార్తి తీర్చేందుకు జలధార వాటర్ ట్యాంకర్లు, వైద్యసేవలకు ఆరోగ్యరథాలు, ఆకలి తీర్చేందుకు అన్నాక్యాంటీన్లు, స్త్రీశక్తి పథకం ద్వారా మహిళలకు కుట్టుమిషన్లు, చిరువ్యాపారులకు తోపుడుబళ్లు, చేనేతలకు రాట్నాలు, స్వర్ణకారులకు పనిముట్లు, వికలాంగులకు ట్రైసైకిళ్లు, పాదచారులు సేదదీరేందుకు సిమెంటు బల్లలు ఇలాంటి 27సంక్షేమ కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేస్తున్నారని చెప్పారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి తమ్మిశెట్టి జానకి దేవి, గుంటూరు పార్లమెంటరీ ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావు, పట్టణ పార్టీ ఉపాధ్యక్షుడు గోవాడ దుర్గారావు, పట్టణ పార్టీ ప్రధాన కార్యదర్శి షేక్ రియాజ్, నియోజవర్గ బీసీ సెల్ అధ్యక్షుడు కారంపూడి అంకమ్మరావు, పట్టణ మైనార్టీ సెల్ అధ్యక్షుడు షేక్ సుభాని, రాష్ట్ర సాధికార సమితి పద్మశాలియ సమితి మీడియా కోఆర్డినేటర్ తిరువీధుల బాపనయ్య, పట్టణఎస్సీ సెల్ అధ్యక్షుడు సర్దార్ దిండ్ల సత్యానందం, పట్టణ ఎస్సీ సెల్ అధ్యక్షుడు పేరం ఏడుకొండలు, మాజీ కౌన్సిలర్ లు దామర్ల పద్మజ, మండు రాము, గుంటూరు పార్లమెంటరీ పద్మశాలీయ సాధికార సమితి సభ్యుడు జంజనం వెంకట సుబ్బారావు, వార్డు అధ్యక్ష కార్యదర్శులు యుద్ధం అప్పారావు ,గంజి చంద్రశేఖర్, చెల్లూరు వీర వెంకట సత్యనారాయణ, బలబద్ర రమేష్, కొప్పూరి రాంబాబు, దామర్ల చంద్రం, మండు రాంబాబు, ఆకునూరి ఉమామహేశ్వ రావు, దామర్ల రాంబాబు, గోడీబుడి చిన్న, దామర్ల బిక్షారావ్, బాసిన నాగేశ్వరరావు, దేశబోయిన వెంకట్రావు తదితర నాయకులు పాల్గొన్నారు.