Trinethram News : పల్నాడు జిల్లా
రాబోవు సంక్రాంతి సందర్భంగా ఎవరు కూడా ఎటువంటి జూద క్రీడలు నిర్వహించవద్దు, ప్రోత్సహించవద్దు.
కోడిపందాలు, జూదం, గుండాటలు మరియు ఇతర నిషేధిత ఆటలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవు.
నిషేధిత ఆటలను ఆడేందుకు అవకాశం ఉన్న ప్రదేశాలలో జిల్లా అంతట వాటిని నిరోధించడానికి పోలిసు వారి ప్రత్యేక నిఘా కొనసాగుతోంది.
…పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీ కంచి.శ్రీనివాస రావు ఐ.పీ.ఎస్., .
జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, పోలీసు ఉన్నత అధికారుల నుండి క్షేత్రస్థాయి పోలీసు సిబ్బంది వరకు జిల్లా వ్యాప్తంగా నిషేధిత ఆటలను ఆడేందుకు అవకాశం ఉన్న ప్రదేశాలలో పర్యటించి, రాబోవు సంక్రాంతి పండుగ సందర్భంగా కోడిపందాలు,జూదం, గుండాటలు మరియు ఇతర నిషేధిత ఆటలను నిరోధించుటకు గాను ప్రత్యేక నిఘా పెట్టడం జరిగింది.
ఈ సందర్భంగా
జిల్లా ఎస్పీ మాట్లాడుతూ… జిల్లాలో సంక్రాంతి పండుగ రోజులలో కోడి పందాలు ఆడుటకు బరులు ఇచ్చినా, నిర్వహించినా, పాల్గొన్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని తెలిపారు.
గతంలో కోడిపందాలు,పేకాట లు నిర్వహించిన మరియు ఆడిన వారి పై జిల్లా వ్యాప్తంగా కౌన్సెలింగ్ మరియు బైండోవర్ కేసులు నమోదు చేస్తున్నామని తెలియపరిచినారు.
కోడి పందాలు, జూదాల వలన ప్రజలు సులభంగా డబ్బులు సంపాదించాలని ఆశపడి పందాలు కాసి డబ్బును నష్టపోతారు. దీని వలన వారి కుటుంబాలలో పండగ పూట కుటుంబం ఇబ్బంది పడే అవకాశం ఉందన్నారు.
ముఖ్యంగా కొందరు యువకులు జూదాల కు బానిసలై… కేసుల్లో ఇరుక్కుని తమ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు. యువత ఇటువంటి కేసులలో ఉంటే వారి యొక్క భవిష్యత్తు అంధకారము అవుతుందని ఎస్పీ తెలిపారు.
కావున జూదం, కోడి పందాలు మరియు నిషేధిత ఆటలు వంటి వాటికి లోనవ్వకుండా వాటికి దూరంగా ఉండాలని సూచించారు.
ప్రజలు కోడిపందాల పై మరియు ఇతర నిషేధిత ఆటల పై ఎలాంటి సమాచారం ఉన్న వెంటనే డయల్ 112 కు సమాచారం అందించాలని, తెలియపరచిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని తెలియజేశారు.
నిర్మానుష్య ప్రదేశాలలో మరియు నిషేధిత ఆటలు నిర్వహించడానికి అవకాశం ఉన్న ప్రదేశాలలో డ్రోన్ ల సహాయంతో నిఘా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App