
మాజీ సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు.
కొత్త సీఎం నన్ను, బీఆర్ఎస్ పార్టీని తిడుతున్నారు.
నన్ను, నా పార్టీని టచ్ చేయడం రేవంత్ రెడ్డి వల్ల కాదు.
రేవంత్ కంటే హేమాహేమీలను ఎదుర్కొన్న చరిత్ర మాది.
పదేళ్లు రాష్ట్రాన్ని పదిలంగా కాపాడుకున్నాం.
ఇప్పుడు కాంగ్రెస్ వాళ్లు రాష్ట్రాన్ని పరాయివాళ్ల పాలు చేస్తున్నారు.
తెలంగాణ కోసం కేసీఆర్ ఏనాడు వెనక్కిపోడు.
ఉడుత బెదిరింపులకు నేను భయపడను అని కేసీఆర్ అన్నారు.
