TRINETHRAM NEWS

నవంబర్ 16వ తేదీ లోపు జీవో రిలీజ్ చేయాలి ఎన్.హెచ్ ఎం. ఉద్యోగులందరికీ క్యాడర్ ఫిక్సేషన్ చేసి బేసిక్ పే వేతనం అమలు చేయాలి

జాతీయ ఆరోగ్య మిషన్ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ ఆచంట అభిషేక్ డిమాండ్

హైదరాబాద్ జిల్లా
21 అక్టోబర్ 2024 త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

వైద్య ఆరోగ్యశాఖ పనిచేస్తున్న తెలంగాణ రాష్ట్రంలో జాతీయ ఆరోగ్య మిషన్ లో 78 క్యాడర్లలో సుమారు 17541 మంది పనిచేస్తున్నారు. వారందరికీ క్యాడర్ ఫిక్సేషన్ చేయాలి, నేషనల్ హెల్త్ మిషన్ ఉద్యోగులందరికి బేసిక్ పే వేతనం అమలు చేయాలి. చాలా సంవత్సరాల నుంచి చాలిచాలని వేతనాలు తీసుకుంటూ ప్రజల కాపాడటంలో ప్రాణాలను అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తున్నాయా ఎన్.హెచ్ ఎం. ఉద్యోగులు అన్నీ జాతీయ ఆరోగ్య మిషన్ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ ఆచంట అభిషేక్ అన్నారు. సుప్రీంకోర్టు గైడ్లైన్స్ 2016లో ఇచ్చిన ప్రకారం సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని బేసిక్-పే అమలు చేయాలని, గత ప్రభుత్వం విడుదల చేసిన పి ఆర్ సి బకాయిలు 7 నెలల వెంటనేచెల్లించాలని, ఎన్.హెచ్.ఎం.

ఉద్యోగులందరికీ సంవత్సరానికి 35 రోజుల క్యాజువల్ లీవ్స్ మంజూరు చేయాలి, హెల్త్ కార్డ్స్ మరియు హెల్త్ ఇన్సూరెన్స్ ,మహిళ ఉద్యోగస్తులకు 180 రోజుల వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు మంజూరు చేయాలి, వైద్య ఆరోగ్యశాఖలో ఉన్న ఖాళీలను ఎన్ హెచ్ ఎం ఉద్యోగులతో భర్తీ చేయాలి, ప్రతి నెల 1వ తేదీన వేతనాలు చెల్లించాలనీ కాంగ్రెస్ ప్రభుత్వం నవంబర్ 16వ తేదీ లోపు ఈ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు, లేదంటే సమ్మె కైనా దిగుతామని హెచ్చరిక జారీ చేయడం జరిగింది..

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App