TRINETHRAM NEWS

NHM cadres meeting at Manchiryal on 28th

మంచిర్యాల జిల్లా త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

ఈ నెల 28న మంచిర్యాలలోని సీపీఐ కార్యాలయంలో మధ్యాహ్నం 1 గంటకు ఎన్ హెచ్ ఎం ఆల్ క్యాడర్ సమావేశం నిర్వహించనున్నట్టు ఆ జిల్లా జాతీయ ఆరోగ్య మిషన్ కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు మేకల దాసు, మంచిర్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి దేవనబోయిన బాపు యాదవ్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎన్ హెచ్ ఎం కాంట్రాక్ట్ అండ్ ఔట్సోర్సింగ్ ఉద్యోగులు ఈ సమావేశానికి అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు..

ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఎన్ హెచ్ ఎం రాష్ట్ర అధ్యక్షులు ఎం నరసింహ, జాతీయ ఆరోగ్య మిషన్ కాంట్రాక్ట్ అండ్ ఔట్ సోర్సింగ్ (ఏఐటియుసి) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ రాజేష్ ఖన్నా, ఎన్ హెచ్ ఎం ఆల్ క్యాడర్స్ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ ఎల్.సురేష్ నాయక్ హాజరవనున్నట్టు తెలిపారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

NHM cadres meeting at Manchiryal on 28th