TRINETHRAM NEWS

నేతాజీ సుభాష్ చంద్ర బోస్ ఓసారి హిట్లర్ ను కలవడానికి అతడి కార్యాలయానికి వెళ్ళాడు. తన కోసం ఎవరొచ్చినా ముందు తన వేషధారణలో ఉన్న వ్యక్తులను పంపడం హిట్లర్ కు అలవాటు. నేతాజీ విషయంలోనూ అలాగే తన రూపంలో ఉన్న కొందరిని అతడిని పలకరించి రమ్మని ఒకరి తర్వాత ఒకరిని పంపించాడు. అంతమంది వచ్చినా స్పందించకుండా నేతాజీ పుస్తకం చదువుకుంటూనే కూర్చున్నాడు.

చివరికి హిట్లరే వచ్చి నేతాజీ భుజం మీద చేయి వేయగానే “హిట్లర్“ అని అతన్ని పలకరించాడట నేతాజీ. హిట్లర్ ఆశ్చర్యపోయి “నన్ను ఎలా గుర్తుపట్టావు“ అని అడిగితే “ప్రపంచంలో హిట్లర్ కు తప్ప సుభాష్ చంద్ర బోస్ మీద చేయి వేసి మాట్లాడే ధైర్యం ఎవరికీ లేదు, చివరికి హిట్లర్ నకిలీలలు కూడా“ అని అన్నాడట నేతాజీ.

దేశ స్వాతంత్ర్య ఉద్యమం లో అత్యంత కీలక పాత్ర పోషించి నాకు రక్తాన్ని ఇవ్వండి మీకు స్వాతంత్ర్యాని ఇస్తాను అనే నినాదాన్ని దేశ నలుమూలలా వినిపించి స్వాతంత్ర్య ఉద్యమానికి వేలాది మంది సైనికులని ఏర్పాటు చేసి భారతవని లో దేశభక్తి ని రగిలించి ఆజాద్ హిందూ ఫౌజ్ దళాన్ని స్థాపించి ఆంగ్లేయుల గుండెల్లో వణుకు పుట్టించిన భారత మాత ముద్దు బిడ్డ శ్రీ నేతాజీ సుభాష్ చంద్ర బోస్ 127 వ జయంతి శుభాకాంక్షలు.