TRINETHRAM NEWS

జాతీయ యువజన దినోత్సవo

త్రినేత్రం: తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం

అనపర్తిలో వర్తక సంఘం కళ్యాణ మండపంలో అనపర్తి శాఖ శ్రీ రామకృష్ణ సేవా సమితి ఆధ్వర్యంలో “జాతీయ యువజన దినోత్సవo” ఘనంగా నిర్వహించారు. ముందుగా అతిథులు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించిన అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి,ఉత్తరకాశీ అద్వైత ఆశ్రమ ప్రతినిధి స్వామి సూర్య భాస్కరేంద్ర సరస్వతి మహరాజ్ వ్యక్తిత్వ వికాస నిపుణులు మహర్షి సాగర్. వివేకానందుని బోధనల స్ఫూర్తి తో ఆత్మవిశ్వాసమే ఆలంబనగా చేసుకుని యువత విజేతలుగా నిలవాలని ఆకాంక్షించిన అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి.

స్వామి వివేకానంద సాహిత్యం మానవ జీవితానికి దిక్సూచిగా నిలుస్తుందన్న ఉత్తరకాశీ అద్వైత ఆశ్రమ ప్రతినిధి స్వామి సూర్య భాస్కరేంద్ర సరస్వతి మహరాజ్.
స్వామి వివేకానంద సాహిత్యంపై ‘వివేకపథం’ పేరిట నిర్వహించిన పోటీ పరీక్షలలో ప్రతిభ కనబర్చిన అనపర్తి మండల పరిధిలోని 21 విద్యాసంస్థలకు చెందిన 63 మంది విద్యర్థులకు, 21 మంది ఉపాధ్యాయులకు, అధ్యాపకులకు జ్ఞాపిక, స్వామీజీ సాహిత్యం, ప్రశంస పత్రాలను అందించారు.
మండల పరిధిలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన అనపర్తి బాలికల పాఠశాల విద్యార్థిని ఎం.షణ్ముఖశ్రీ, అనపర్తి బాలుర పాఠశాల విద్యార్థిని కే . ప్రియలక్ష్మి, అనపర్తి కే ఏ ర్ హైస్కూల్ ఎం . సందీప్ రెడ్డిలకు స్వామి వారికానంతర సాహిత్య ప్రతిభ పురస్కారం పేరిట ఒక్కొక్కరికి రూ.1,000 నగదు, జ్ఞాపికాలను , స్వామీజా సాహిత్యం, ప్రశంస పత్రాలను అందచేసిన అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి,ఉత్తరకాశీ అద్వైత ఆశ్రమ ప్రతినిధి స్వామి సూర్య భాస్కరేంద్ర సరస్వతి మహరాజ్.

ఈ కార్యక్రమంలో గోదావరి తూర్పు డెల్టా ప్రాజెక్టు కమిటీ వైస్ చైర్మన్ తమలంపూడి సూధాకర్ రెడ్డి,వ్యక్తిత్వ వికాస నిపుణులు మహర్షి సాగర్, సమితి ఉపాధ్యక్షులు సత్తి వెంకటరెడ్డి తాతవ సుందర రామారెడ్డి, ప్రధాన కార్యదర్శి నల్లమిల్లి సుబ్బారెడ్డి, కార్యదర్శులు తాడి చంద్రశేఖర్ రెడ్డి, మల్లిడి శ్రీనివాసరెడ్డి, కొవ్వూరి సత్తిరెడ్డి,నల్లమిల్లి శ్రీనివాసరెడ్డి,రామకృష్ణ మిషన్ సమితి సభ్యులు దుర్గాప్రసాద్, తహశీల్దార్ డి .వి .ఎన్ అనిల్ కుమార్, ఎం డి వో మండ రామకృష్ణారెడ్డి, రామకృష్ణ మిషన్ సమితి సభ్యులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App