TRINETHRAM NEWS

సామాజిక సేవకుడైన అభిలాషకు జాతీయ అవార్డు

కరీంనగర్ జిల్లా:డిసెంబర్ 25
మంచిర్యాల జిల్లా రాంనగర్ కు చెందిన డా.నూతి.అభిలాష్ కు ఈరోజు జాతీయ స్థాయి స్పూర్తి శిఖరం అవార్డ్ ప్రధానం చేశారు.

అంతర్జాతీయ గుర్తింపు పొందిన సాహితీ సామాజిక సేవా సంస్థ ఆర్యాణీ సకల కళా వేదిక ,శ్రీ గౌతమేశ్వరా సాహితీ కళా సేవా సంస్థ సంయుక్తంగా ఫిలింభవన్, కరీంనగర్ లో ఈరోజు వేదికగా జరిగిన కార్యక్రమం లో జాతీయ స్థాయి స్పూర్తి శిఖరం అవార్డ్ ను అందు కున్నారు.

ఈ సందర్భంగా అర్యానీ మరియ గౌతమేశ్వర సంస్థల అధ్యక్షులు దూడపాక శ్రీధర్ మాట్లాడుతూ..విద్యా రంగం లో రెండు ప్రపంచ రికార్డు లను పొందిన నూతి అభి లాష్,ఉపాధ్యాయ రంగం లో సాహితీ మరియ సామాజిక రంగం లో డా.నూతి.అభిలాష్ ప్రతిభ,కృషి,సేవలకు గుర్తిం పుగా ప్రోత్సాహకంగా ఈ జాతీయ స్థాయి అవార్డును ప్రధానం చేస్తున్నట్లుగా తెలియచేసారు.

ఈ కార్యక్రమమునకు ప్రముఖ కవి రచయిత మరియ,విమర్శకులు భవానీ, సాహిత్య వేదిక అధ్యక్షులు డా.వైరాగ్యం ప్రభాకర్, శ్రీ కంఠ గాయకులు గిన్నిస్ బుక్ హోల్డర్ డా,సుబ్రమణ్య దీక్షితులు ప్రముఖ రంగస్థల నటులు కుమారి బి యన్ కృష్ణ కుమారి, ప్రముఖ పర్యా వరణ వేత్త పిట్టల రవిబాబు ప్రముఖ కవి పోర్ల వేణు గోపాల్ పాల్గొన్నారు,

ఈ సందర్భంగా డా.నూతి.అభిలాష్ మాట్లాడుతూ మున్ముందు కూడా విద్యా సాహితీ సామాజిక రంగాలలో తన వంతు కృషి చేస్తానని తెలియచేసారు…