నరేంద్ర మోడీకి ఎక్సపైర్ డేట్ వచ్చేసింది: సీఎం రేవంత్ రెడ్డి
నాగపూర్ : కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా నాగపూర్‌లో ఏర్పాటు చేసిన సభలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పీచ్‌తో అదరగొట్టారు.
రేవంత్ రెడ్డి స్పీచ్ కు సభలో పాల్గొన్న కార్యకర్తలంతా ఈలలు, అరుపులతో మద్దతు ప్రకటించారు. హిందీలో స్పీచ్‌ను మొద లుపెట్టిన రేవంత్ రెడ్డి.. దేశంలో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు.
ఎర్రకోటపై కాంగ్రెస్ జెండా ఎగరటం ఖాయమంటూ అభిమానుల్లో ఉత్సాహం నింపారు. కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేశారని.. 150 రోజులు 4 వేలకు పైగా కిలోమీటర్లు రాహుల్ భారత్ జోడో యాత్ర చేశారని రేవంత్ గుర్తు చేశారు.
భారత్ జోడో యాత్ర చేసిన సమయంలో.. రాహుల్ గాంధీ మొదట అడుగు కర్ణాటకలో పెట్టారని.. అక్కడ కాంగ్రెస్ అధికా రంలోకి వచ్చిందని తెలిపారు. కర్ణాటక తరువాత రాహుల్ గాంధీ తర్వాతి అడుగు తెలం గాణలోనే వేశారని.. తెలంగాణలోనూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందని చెప్పుకొచ్చారు.
ఇక.. తెలంగాణ తరువాత జోడో యాత్ర మహారాష్ట్రలో ప్రవేశించిందని.. ఈసారి మహారాష్ట్రలోనూ కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని రేవంత్ రెడ్డి లాజిక్‌తో శ్రేణుల్లో జోష్ నింపారు. ఇప్పుడు.. రాహుల్ గాంధీ “భారత్ న్యాయ యాత్ర” మణిపూర్ నుంచి మహారాష్ట్ర వరకు చేపట్టనున్నారని..
దీంతో ఈసారి దేశంలో ఎర్రకోటపై కాంగ్రెస్ మూడు రంగుల జెండా ఎగరడం ఖాయమన్నారు. పార్లమెం ట్లోకి చొరబడిన దుండ గులను ఆపలేక పోయిన మోదీ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడకుండా కూడా ఆపలేరంటూ చెప్పుకొచ్చారు.
ప్రతి మెడిసిన్‌కు ఒక ఎక్స్పైరీ తేదీ ఉంటుందన్న రేవంత్.. నరేంద్ర మోదీ అనే మెడిసిన్‌కు కూడా ఎక్స్పైరీ తేదీ వచ్చిందన్నారు. రాబోయే రోజుల్లో మోదీ అనే మెడిసిన్ దేశంలో పనిచేయదంటూ చలోక్తులు విసిరారు