డిండి మండల కేంద్రంలో పలు అభివృద్ధి పనుల శంకుస్థాపన చేపట్టిన నల్గొండ పార్లమెంట్ సభ్యులు కుందూరు రఘువీర్ రెడ్డి మరియు దేవరకొండ శాసనసభ్యులు నేనావత్ బాలు నాయక్.
డిండి(గుండ్లపల్లి) త్రినేత్రం న్యూస్.
పలు అభివృద్ధి పనుల శంకుస్థాపన కార్యక్రమంలో నల్గొండ ఎంపీ కుందూరు రఘువీర్ రెడ్డి తో కలిసి పాల్గొన్న దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్.
డిండి(గుండ్లపల్లి) మండల కేంద్రంలోని అంగడి బజార్ లో సెంట్రల్ లైటింగ్ తో కూడిన రోడ్డు నిర్మాణ పనుల శంకుస్థాపన కార్యక్రమం అలాగే తహశీల్దార్ కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి మరియు షాది ముబారక్ లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ కార్యక్రమం అనంతరం డిండి మండల కేంద్రంలో స్త్రీ నిధి & మత్స్య శాఖల ద్వారా సబ్సిడీతో ఏర్పాటు చేసిన సంచార చాపల విక్రయ వాహనం పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా నల్గొండ ఎంపీ శ్రీ కుందూరు రఘువీర్ రెడ్డి తో కలిసి పాల్గొన్న దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్.
ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ:- గత ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసిన… కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దుకుంటూ ఇచ్చిన హామీలను నెరవేరుస్తుందన్నారు.
తాను శాసన సభ్యునిగా గెలిచిన అనతి కాలంలోనే దేవరకొండ నియోజకవర్గంలో పాటు గుండ్లపల్లి మండలాన్ని ఎంపి రఘువీర్ రెడ్డి మరియు జిల్లా మంత్రుల సహకారంతో అన్ని రంగాలలో అభివృద్ధి చేసేందుకు తాను శాయశక్తుల కృషి చేస్తున్నానని అన్నారు.
నల్గొండ ఎంపీ కుందూరు రఘువీర్ రెడ్డి మరియు జిల్లా మంత్రుల సహాకారంతో డిండి ఎత్తిపోతల పథకానికి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన ఏదుల రిజర్వాయి నుంచి నీటిని డిండికి తీసుకోవడానికి మంత్రి వర్గం ఆమోదించింది అన్నారు.
ఇటీవల కాలంలో గిరిజన తండాలకు మంచినీటి సౌకర్యంతో పాటు గ్రామాలలో సిసి రోడ్లను మంజూరు చేసి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయడం జరిగిందని అన్నారు.
అదేవిధంగా అన్ని గ్రామాలలో మౌలిక వసతులను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం అన్ని విధాలుగా కృషి చేస్తుందని అన్నారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కాంగ్రెస్ ప్రభుత్వంతోనే జరుగుతుందని అభివృద్ధికి కృషి చేస్తున్న ప్రభుత్వానికి ప్రజలందరూ అండగా నిలవాలని కోరారు.
అనంతరం డిండి మండల కేంద్రంలో స్త్రీ నిధి & మత్స్య శాఖల ద్వారా సబ్సిడీతో ఏర్పాటు చేసిన సంచార చాపల విక్రయ వాహనం నల్గొండ ఎంపీ కుందూరు రఘువీర్ రెడ్డి తో కలిసి పంపిణీ చేయడం జరిగింది.
తదనంతరం తహశీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కళ్యాణ లక్ష్మి మరియు షాది ముబారక్ లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని,అర్హులైన లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేయడం జరిగింది.
అలాగే మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇండ్ల నమూనా పనులను శంకుస్థాపన చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో దేవరకొండ మార్కెట్ కమిటీ చైర్మన్ నాయిని జమున మాధవ రెడ్డి, నల్గొండ పార్లమెంట్ కోఆర్డినేటర్ సిరాజ్ ఖాన్,మండల బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దొంతినేని వెంకటేశ్వర్ రావు,డిండి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నల్లవెల్లి రాజేష్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ బద్దెల శ్రీనివాస్ యాదవ్, పిఏసిఎస్ చైర్మన్ తూమ్ నాగార్జున రెడ్డి, యువజన కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు కొర్ర రాంసింగ్ నాయక్,నియోజక వర్గ అధ్యక్షులు కిన్నెర హరికృష్ణ,PD శేఖర్ రెడ్డి, మత్స్య శాఖ అధికారి చారితా,DE,తహసీల్దార్, ఎంపిడిఓ,యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షులు గడ్డమిది సాయి ఉపాధ్యక్షులు వెన్నెల, ప్రధాన కార్యదర్శి మీసాల రజినీకాంత్ మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రేఖ్య నాయక్, వెంరెడ్డి వెంకట్ రెడ్డి, తూమ్ బుచ్చి రెడ్డి, బొల్లె శైలేష్,తూమ్ సుమిత్ రెడ్డి, శశిదర్ రెడ్డి, దొంతినేని నాగేశ్వర్ రావు, మాజీ సర్పంచ్ లక్ష్మి,పెర్వల జంగారెడ్డి, గుర్రం రాములు, బాధమోని శ్రీనివాస్ గౌడ్, వంకశ్వరం వెంకటయ్య, మీసాల రామ చంద్రయ్య, పొలం లక్ష్మణ్, పోలా వెంకటేష్, యాసని హన్మంత్ రెడ్డి, విష్ణు వర్ధన్ రెడ్డి, జంగా గిరీష్, మహ్మద్ అలీ, గోపాల్, జంతుక వెంకటయ్య, నల్లవెల్లి దామోదర్ రెడ్డి, బొడ్డుపల్లి లక్ష్మయ్య, గోపాల్ రావు, భగవంత రావు, యాదగిరి రావు, ఆనంద్ రెడ్డి,మైనార్టీ నాయకులు రహీమ్, ఉమర్, ఖాదర్, కయ్యుమ్, షబ్బీర్, రాత్లావత్ ధర్మ నాయక్,గోపాల్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App