
Trinethram News : ఎన్టీఆర్ జిల్లా మైలవరం
మండలంలోని గణపవరం గ్రామానికి చెందిన అడ్వకేట్, ప్రజలకు చిరపరిచితులైన పజ్జూరి సాంబశివరావు గౌడ్ ఎమ్మెల్యే అభ్యర్థి రేసులో తానూ ఉన్నానంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 60 లక్షలు, నియోజకవర్గంలో 35 వేల ఓటింగ్ కలిగిన గౌడ సామాజిక వర్గం నుండి బీసీ కోటాలో తనకు అవకాశం కల్పిస్తే ఎమ్మెల్యే సీటును గెలిచి కానుకగా ఇస్తానని ఢంకా భజాయిస్తున్నారు.గత 20సంవత్సరాల నుండి రాజకీయాల్లో ఉండడమే కాక 2009-10 సంవత్సరాలలో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ లీగల్ సెల్ కన్వీనర్ గా, తదుపరి వైసీపీ పార్టీ స్థాపించిన 2011నాటి నుండి 2021 వరకూ వైసీపీ మైలవరం మండల లీగల్ కన్వీనర్ గా భాద్యతలు నిర్వహించి తన రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగించానన్నారు. ప్రస్తుతం అదనపు ప్రభుత్వ న్యాయవాధిగా విధులు నిర్వహిస్తున్న పజ్జూరి వెంకట సాంబశివరావు గౌడ్ మైలవరం నియోజకవర్గం నుండి ఎమ్మెల్యే అభ్యర్థిగా రేసులో ఉన్నానని, అవకాశం కల్పిస్తే తగ్గేది లేదంటూ అనూహ్యంగా తెరపైకి వచ్చారు.
