TRINETHRAM NEWS

రామగుండం ప్రాంతాన్ని ఎడ్యుకేషన్‌ హబ్‌గా తీర్చి దిద్దడమే నా లక్ష్యం

మక్కాన్‌ సింగ్‌ రాజ్‌ ఠాకూర్‌
రామగుండం ప్రాంతాన్ని ఎడ్యుకేషనల్‌ హబ్‌గా మార్చేందుకు

గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

గోదావరిఖని ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్‌ రాజ్‌ఠాకూర్‌ కృషి చేస్తున్నారు. దానిలో భాగంగా ఈ ప్రాంతానికి నర్సింగ్‌ కళాశాల మరియు ఇంటిగ్రేటెడ్‌ కళాశాలలను జీఓ నెం.183 మరియు ఇంటిగ్రేటెడ్‌ స్కూల్‌ జీఓ నెం.ఆర్‌టీ 223, జీఓ ఆర్‌టీ నెం.190 ఎస్‌ఈ(ట్రెజరీ) డిపార్ట్‌మెంట్‌ తేది:10102024న మంజూరు కావడం జరిగింది. దానిలో భాగంగా నర్సింగ్‌ కళాశాలకు రూ.26కోట్లు మంజూరు చేసి 60సీట్లతో అనుమతి లభించింది. దీనిని పురస్కరించుకుని స్థానిక పట్టణ కాంగ్రెస్‌ అధ్యక్షులు తిప్పారపు శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో ఆదివారం 300మంది కాంగ్రెస్‌, దాని అనుబంధ సంఘాల కార్యకర్తలతో ర్యాలీ నిర్వహించిన అనంతరం స్థానిక చౌరస్తాలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి మరియు రాష్ట్ర ఐటీశాఖ మాత్యులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు మరియు రామగుండం శాసన సభ్యులు మక్కాన్‌సింగ్‌ రాజ్‌ఠాకూర్‌ మరియు వైద్య శాఖ మాత్యులు దామోదర రాజనరసింహ చిత్రపటాలకు పాలాభిషేకం మరియు స్వీట్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రామగుండం నగర కాంగ్రెస్‌ అధ్యక్షులు బొంతల రాజేష్‌, నగర మేయర్‌ బంగి అనీల్‌ కుమార్‌, ఫ్లోర్‌ లీడర్‌ మహంకాళి స్వామి, టీపీసీసీ సెక్రటరీ కాల్వ లింగస్వామి హాజరై మాట్లాడుతూ రామగుండం ప్రాంతం అభివృద్ధే లక్ష్యంగా పెట్టుకుని ప్రజా శ్రేయస్సునే లక్ష్యంగా నిరంతరం ప్రజల కోసం పని చేస్తున్న మా ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్‌ పై బురద జల్లే ప్రయత్నం మరియు మతి భ్రమించి మాట్లాడుతున్నారు. గత బీఆర్‌ఎస్‌ పాలనలో కేజీ టు పీజీ విద్య అని ప్రజలను మోసం చేయడం జరిగింది. అసత్య ప్రకటనలు చేసి కాలయాపన చేశారు. మా ప్రభుత్వంలో ప్రతి నియోజకవర్గానికి ఇంటిగ్రేటెడ్‌ స్కూల్‌ మంజూరు చేసి తద్వారా ఎడ్యుకేషన్‌ హబ్‌గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నారు. అంతేకాకుండా రామగుండం ప్రాంతానికి వందల కోట్ల నిధులు తీసుకువచ్చి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నారు. దానిలో భాగమే 800మెగావాట్ల పవర్‌ ప్రాజెక్టుకు రూ.8500కోట్లు కేటాయించారు. దాని ద్వారా వేలాది మంది నిరుద్యోగులకు ఉపాధి లభిస్తుంది. మరియు 3×800 పవర్‌ ప్రాజెక్టుకు 2400మెగావాట్ల పవర్‌ ప్రాజెక్టుకు మంజూరు చేయించడం జరిగింది. ఈ ప్రాంతంలో నిరుద్యోగులకు ఉపాధి కల్పించడంతో పాటు పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నారు.
ఈ కార్యక్రమానికి చొరవ తీసుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఐటీశాఖ మంత్రివర్యులు శ్రీధర్‌బాబు వైద్య ఆరోగ్యశాఖ మంత్రివర్యులు దామోదర రాజనర్సింహ గార్లకు, రామగుండం నియోజకవర్గ శాసనసభ్యులు మక్కా న్ సింగ్ రాజ్ ఠాకూర్ కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు , కార్పొరేటర్లు మాజీ కార్పొరేటర్లు వివిధ విభాగాల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App