TRINETHRAM NEWS

ప్రజలకు మేలు చేయడమే నా జీవిత లక్ష్యం,

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ నాకు ఎలాంటి ఆశలు లేవని శాసనసభ సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ పేర్కొన్నార*
శనివారం మోమిన్ పేట్ ఎంపిడిఓ కార్యాలయం ఆవరణలో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ కింద 42 మంది లబ్ధిదారులకు 42,04,873 విలువ గల చెక్కులు, ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా 19 మంది లబ్ధిదారులకు 8 లక్షల 20 వేల చెక్కులను పంపిణీ చేశారు. అదేవిధంగా 1.69 కోట్ల నాబార్డు వారి ఆర్థిక సహాయంతో నిర్మాణం చేపట్టిన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం గోదాము, కార్యాలయాన్ని స్పీకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో స్పీకర్ మాట్లాడుతూ…పేదల సంక్షేమం, అభివృద్ధి కోసం అహర్నిశలు పని చేస్తానన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాల్లో లబ్ధి చేకూర్చేందుకు చర్యలు తీసుకుంటానని శాసనసభ సభాపతి హామీ ఇచ్చారు.

వికారాబాద్ జిల్లా అభివృద్ధితో ప్రజలకు సేవ చేయడమే ధ్యేయమని ఆయన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సంక్షోభంలో ఉన్నప్పటికీ వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు జిల్లాకు 950 కోట్ల నిధులను మంజూరు చేయడం జరిగిందని, మోమినిపేట్ మండలానికి 44 కోట్ల 56 లక్షల నిధులు విడుదల చేయడం జరిగిందని ఆయన తెలిపారు. గ్రామాల్లో ఇండ్లు లేని ప్రతి పేదవాడికి ఇంటి నిర్మాణాలు చేసుకునేందుకు వికారాబాద్ నియోజకవర్గానికి 12 వేల ఇండ్లు మంజూరు అయ్యాయని, మరో విడతలో కూడా ఇంకా ఇల్లు మంజూరు చేసి అర్హులైన ప్రతి ఒక్కరు లబ్ధి పొందేలా చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు నియోజకవర్గంలో ఇంటి స్థలం లేని వారిని గుర్తించి స్థలంతో పాటు ఇంటి నిర్మాణం చేపట్టుకునేందుకు ఆర్థిక సహాయం అందజేస్తామని ఆయన తెలిపారు.

సాగు యోగ్యంలో ఉన్న ప్రతి ఎకరాకి రైతు భరోసా కింద రెండు దఫాలుగా 12 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని జనవరి 26 నుండి రైతుల ఖాతాల్లోకి జమ చేయడం జరుగుతుందని స్పీకర్ ఈ సందర్భంగా తెలిపారు. పార్టీలకు అతీతంగా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపడతానని, అభివృద్ధి దిశగా అందరము కలిసి ముందుకు వెళ్లాలని ఆయన సూచించారు. జిల్లాలో పారిశ్రామిక రంగాలను నెలకొల్పి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా కృషి చేస్తానని స్పీకర్ తెలిపారు. జిల్లాలోని అనంతగిరి అటవీ ప్రాంతంలో 1000 కోట్ల వ్యయంతో పర్యాటక రంగంగా తీర్చిదిద్దుతానని, ఆ దిశగా అడుగులు వేయడం జరుగుతుందని స్పీకర్ తెలిపారు. జిల్లాలోని చెరువులను గుర్తించి వాటి అభివృద్ధి దిశగా నే పర్యాటక రంగంగా అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు.
జిల్లాలో కులాలకు అతీతంగా 25 ఎకరాల విస్తీర్ణంలో 250 కోట్ల వ్యయంతో సమీకృత పాఠశాలను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించిందని స్పీకర్ ఈ సందర్భంగా తెలిపారు. ఇప్పటికే జిల్లాలో వైద్య సదుపాయాలను మెరుగుపరిచేందుకు గాను ఆసుపత్రులనుబలోపేతం చేస్తూనే, వైద్య కళాశాలను ఏర్పాటు చేసుకోవడం జరిగిందని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు.పంచాయతీరాజ్ రోడ్లను అభివృద్ధి చేసేదిశగా 250 కోట్ల నిధులను మంజూరు చేయడం జరిగిందని స్పీకర్ ప్రసాద్ కుమార్ తెలిపారు. జిల్లాలోని నాలుగు అతి ముఖ్యమైన రహదారులకు 10 వేల కోట్ల నిధుల మంజూరి నిమిత్తం కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు రూపొందించడం జరిగిందని స్పీకర్ తెలిపారు.

అనంతరం మల్లారెడ్డి గూడ, చక్రం పల్లిల్లో 20 లక్షల చొప్పున నిర్మించే గ్రామపంచాయతీల భవన నిర్మాణ పనులకు స్పీకర్ శంకుస్థాపనలు గావించారు.ముందుగా మోమీన్ పేట మండల కేంద్రంలోని పద్మావతి పల్లె సినిమా పాఠశాల క్రికెట్ ప్లే గ్రౌండ్ ను స్పీకర్ ప్రారంభించి బ్యాటింగ్, బౌలింగ్ చేశారు.ఈ కార్యక్రమాల్లో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా డిసిసిబి అధ్యక్షులు కొత్త కురుమ సత్తయ్య, డైరెక్టర్ అంజిరెడ్డి, పిఎసిఎస్ చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి, వైస్ చైర్మన్ రామచంద్ర రెడ్డి, మర్పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ మహేందర్ రెడ్డి, జిల్లా సహకార అధికారి నాగలింగా చారి తహసిల్దార్ మనోహర్ చక్రవర్తి, ఎంపిడిఓ విజయలక్ష్మి, సీఈవో శేఖర్, హెల్ప్ ఆల్ సొసైటీ చైర్మన్ సుందర్ తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App