కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలో గల చింతలకుంట చెరువు మాయం కాబోతుందా అంటే అవుననే అంటున్నారు స్థానికులు ఎందుకు ఇటువంటి ఆరోపణలు వస్తున్నాయి అంటే అక్కడ జరుగుతున్న సంఘటనలే కారణం అంటున్నారు ఏంటి అనుకుంటున్నారా అక్కడ చింతలకుంట చెరువు కొద్దికొద్దిగా పూడ్చి బహుళ అంతస్థుల నిర్మాణాలు చేపడుతున్నారు అని దానిని ఎవరు అడ్డుకునే వారు లేరు అని అంటున్నారు
ఎందుకు అధికారులు పట్టించుకోవట్లేదా
ఎంత మంది అధికారులుకు ఫిర్యాదులు చేసిన పటించుకోవట్లేదు అని అక్కడి స్థానికులు చెబుతున్నారు దింట్లో రాజకీయ నాయకుల ప్రమేయం ఏమైనా ఉందా అనే ప్రశ్నలు కూడా తేలేతుతున్నాయి ఒకవేళ అదే నిజమైతే, అధికారులు అక్కడి నాయకులకి తొత్తులుగా మారారా? లేకపోతే నాయకులకి బయపడుతున్నారా? అనేది తెలియాలిసిఉంటది లేదు అంటే అధికారులకి ముట్టవలసినయి ముట్టిఅయినా ఉండాలి లేకపోతే ఇంత జరుగుతున్న ఎవరు ఎందుకు పట్టించు కోవట్లేదు, మీడియా లో కథనలు వస్తే కానీ అధికారులు స్పందించరా? లంచాలు తీసుకునే అధికారులు పైన వెంటనే చర్యలు తీసుకోవాలి, ఏసీబీ అధికారులు ఇలాంటి వారిపైన నిఘా పెంచాలిసిందేనెమో? చింతలకుంట చెరువును కాపాడుతారో లేకపోతే కబ్జాదారుల చేతివాటానికి కనుమరుగు అవుతుందో అధికారులే సమాధానం చెప్పాలి, ఏమి జరుగుతుందో వేచి చూడాల్సిందే మరి