ఎస్సీ, ఎస్టీ వర్గీకరణపై సుప్రీం తీర్పు స్వాగతిస్తున్నాం
- పేద వర్గాలకు సంపదలో వాటా దక్కేందుకు కులగణన కూడా తప్పదు
- టీపీసీసీ క్యాంపెయిన్ కమిటీ చైర్మన్ , మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్
ఎస్సీ, ఎస్టీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు నియమించిన ఏడుగురు సభ్యుల ధర్మాసనం తీర్పు ఇవ్వడం హర్షనీయమని, కాంగ్రెస్ పార్టీ స్వాగతిస్తుందని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్, మాజీ పార్లమెంట్ సభ్యులు మధుయాష్కి గౌడ్ పేర్కొన్నారు.
సుప్రీం తీర్పుపై ఆయన స్పందిస్తూ.. . ఎస్సీ వర్గీకరణ కోసం 30 ఏళ్లకు పైగా జరుగుతున్న ఉద్యమాలు, పోరాటాలకు.. సుప్రీం తీర్పు ఎంతో ఉపశమనం కల్పించిందన్నారు. వర్గీకరణ పై రాష్ట్రాలకు అధికారం ఉందని సుప్రీం కోర్టు తీర్పు వెలువరించిన నేపథ్యంలో.. తెలంగాణలో తమ రేవంత్ రెడ్డి ప్రభుత్వం.. మాల , మాదిగ ఉపకులాల ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తగిన నిర్ణయం తీసుకొని పనిచేస్తుందన్నారు.
సమాజంలో వెనకబడిన, అణిచివేయబడిన కులాలు, వర్గాలకు సరైన సమయంలో సరైన న్యాయం తప్పక జరుగుతుందన్నారు. వారికి విద్యా, ఉద్యోగ రంగాలలో సమాన అవకాశాలు కల్పించేలా వ్యవస్థలు పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. దేశంలోనూ అన్యాయం జరుగుతున్న వర్గాలకు న్యాయం చేయడం కోసం కులగణన జరగాలని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, లోక్ సభ లో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ డిమాండ్ చేస్తున్నారన్నారు. దేశాన్ని ఎక్స్ రే తీసి సంపదలో వాటా కల్పించాలన్న రాహుల్ గాంధీ డిమాండ్ న్యాయమైనదన్నారు. కులగణన చేయక తప్పదని.. పేద వర్గాలను గుర్తించి వారికి సమాన అవకాశాలు, సంక్షేమం అందించక తప్పదని మధుయాష్కి గౌడ్ పేర్కొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App