
కేంద్రభారీ పరిశ్రమల మంత్రిని కలిసిన ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి
వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ తాండూరుసీసీఐలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెచ్డి కుమారస్వామి ని కలిసిన చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి.
తాండూర్ లో ఉన్న సిసిఐ లో నెలకొన్న అనేక సమస్యలను పరిష్కరించాలని కోరుతూపార్లమెంటులో కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెచ్డి కుమారస్వామిని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీసీఐ లోనెలకొన్న సమస్యలు, పరిష్కరించడంతో పాటు ఉత్పత్తి గననీయంగా పడిపోవడంజరిగిందని, ఉత్పత్తిని మరింతఎక్కువగా పెంచాలని కోరడం జరిగింది. సీసీఐ కార్మికులకు మరియు వారి కుటుంబాల కోసం ఈ ప్రాంతంలో ఈఎస్ఐఆసుపత్రినిఏర్పాటుచేయాలని కోరారు. అదేవిధంగా ఉద్యోగులకు సంబంధించిన ఇతర సమస్యలను పరిష్కరించి సీసీఐ ని మరింత బలోపేతం చేయాలని కొండా విశేశ్వర్ రెడ్డి కేంద్రమంత్రికి విజ్ఞప్తి చేశారు. దీనికి కేంద్ర మంత్రి సిహెచ్డి కుమారస్వామి సానుకూలంగా స్పందించారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
