TRINETHRAM NEWS

పార్లమెంటులో రాష్ట్ర సమస్యలను లేవనెత్తు తున్నాను, పోరాటం చేస్తున్నాను.

మా తాత స్ఫూర్తితో రాజకీయాల్లోకి వచ్చాను, మా తాతకు 55 ఏళ్ల రాజకీయ చరిత్ర ఉంది, మా అమ్మ కూడా ప్రజాసేవ కోసం అమెరికా నుంచి తిరిగి వచ్చింది, మా అమ్మ నాలుగు సార్లు ఎమ్మెల్యేగా సేవలందించారు.

ప్రజలకు సేవ చేసేందుకు నేను కూడా అమెరికా నుంచి తిరిగి వచ్చా.

చాలామంది వివిధ రంగాల్లో ఉంటూ రాజకీయాల్లోనూ కొనసాగుతున్నారు.

వైద్యులు, రైతులు వివిధ వృత్తుల వారు రాజకీయాల్లో ఉన్నారు, అదేవిధంగా నేను కూడా వ్యాపారిగా, రాజకీయ నాయకుడిగా రాణిస్తున్నా..

రాజకీయాలకు ముందు నాకు వ్యాపార అనుభవం ఉంది, కొంత విశ్లేషణ చేసి టీడీపీ సరైందని భావించి పార్టీలో చేరాను.

గ్రూపు రాజకీయాల నుంచి నేను దూరంగా వున్నాను స్థానిక నాయకులు, ప్రజలను నమ్ముకుని ముందుకు వెళ్లా

రాష్ట్రానికి ప్రత్యేక హోదా గురించి పార్లమెంటులో లేవనెత్తా, అమరావతిని రాజధానిగా చేయడానికి పోరాడుతూనే ఉన్నాం.

అమరావతి ప్లానింగ్ కమిటీలోనూ సభ్యుడిగా ఉన్నా అమరావతి మాస్టర్ ప్లాన్ విభాగంలోనూ పనిచేశా, మాస్టర్ ప్లాన్ లో భాగంగా జపాన్, సింగపూర్ తదితర దేశాల్లో పర్యటిచాం.

రాజకీయాలు, వ్యాపారాన్ని ఎప్పుడూ వేరుగానే చూశా, రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం గట్టిగా పోరాడాం,ప్రభుత్వం నుంచి బయటకు వచ్చినప్పుడు అవిశ్వాసం పెట్టారు. అవిశ్వాసం పెట్టినప్పుడు స్పీకర్ గా నేనే వ్యవహరించా. అందువల్లే ఈడీ నన్ను రెండు సార్లు పిలిచి విచారించింది.

నా వ్యాపారాలన్నీ నిఘా పరిధిలోనే ఉన్నాయి. సీబీఐ, ఈడీ నా ఫోన్లను ట్యాప్ చేస్తోంది : ఎంపీ గల్లా జయదేవ్