కొండగట్టు అంజన్న స్వామిని దర్శించుకున్న సినీ హీరో వరుణ్ తేజ్!
Trinethram News : జగిత్యాల జిల్లా : డిసెంబర్ 03
మెగా హీరో వరుణ్ తేజ్ కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి వారిని మంగళ వారం దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ అర్చకులు, అధికారులు పూర్ణకుంభ స్వాగతం పలికారు.
స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆయనకు, ఆలయ అర్చకులు ఆశీర్వచనం, తీర్థప్రసాదాలు, స్వామివారి చిత్రపటం అందజేశారు.
ఈ సందర్భంగా హీరో వరుణ్ తేజ్ మాట్లాడుతూ కొండగట్టు అంజన్న చాలా మహిమగల దేవుడని, తొలిసారిగా హనుమాన్ దీక్ష తీసుకుని, స్వామివారిని దర్శించుకోవడం ఆనం దంగా ఉందని అన్నారు.
మెగా హీరో వరుణ్ తేజ్‌కి ఈ మధ్య అసలు కలిసి రావడం లేదు. దీంతో కొత్త సినిమా షూటింగ్ కు ఇంకా సమయం ఉండటంతో హనుమాన్ దీక్ష చేపట్టారు. రానున్న సినిమాలతోనైనా సక్సెస్ బాట పట్టాలని అంజన్నను కోరుకుంటు న్నారు.
గతంలో ఫిదా, తొలిప్రేమ, గద్దల కొండ గణేష్ సినిమాలతో హిట్లు అందుకున్న వరుణ్ తేజ్ కెరీర్ గ్రాఫ్ సడన్‌గా పడిపోయింది.
ఆపరేషన్ వాలంటైన్, గాండీవ ధారి అర్జున, గని, సినిమాలతో వరుస డిజా స్టార్లను అందుకున్నాడు.
ఇటీవల మట్కా సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చినప్పటికి ఈ సినిమా కూడా డిజాస్టర్ గా నిలిచింది.
వరుస ఫ్లాప్ లతో తన యాక్షన్ సినిమాల జోనర్ రూట్ మార్చిన వరుణ్ తేజ్ హార్రర్ కామెడీ నేపథ్యంతో కూడిన సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App