TRINETHRAM NEWS

మోహన్ బాబు మీడియాకు బేషరతుగా క్షమాపణ చెప్పాలి

మాదిగ జర్నలిస్ట్ ఫోరం జిల్లా ఉపాధ్యక్షుడు ఎడవల్లి సోము మాదిగ

Trinethram News : పాలకుర్తి : సినీ నటుడు నిర్మాత విద్యాసంస్థల అధినేత మాజీ రాజ్యసభ సభ్యులు మోహన్ బాబు మీడియా మిత్రులకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని మాదిగ జర్నలిస్ట్ ఫోరం జిల్లా కోశాధికారి భాషిపాక ఎల్లేష్ మాదిగ, జిల్లా ఉపాధ్యక్షుడు ఎడవల్లి సోము మాదిగ సంయుక్తంగా బుధవారం పాలకుర్తి నియోజకవర్గ కేంద్రంలో డిమాండ్ చేశారు. జల్ పల్లిలో మోహన్ బాబు మీడియా పై అరాచకం సృష్టించాడు మంచు మనోజ్ మోహన్ బాబు కుటుంబ సభ్యుల మధ్య జరిగిన ఉద్రిక్త సంఘటనను కవర్ చేయడానికి వెళ్లిన మీడియా మిత్రులపై దాడి చేయడమే కాకుండా దుర్భాషలాడిన మోహన్ బాబు మీడియా మిత్రులకు క్షమాపణ చెప్పాలని అన్నారు. మోహన్ బాబు మీడియా మిత్రుల మైకులు లాక్కొని రౌడీ లాగా దాడి చేయడం సిగ్గుచేటు.

జరిగిన సంఘటనను సమాజానికి తెలియజేయాల్సిన బాధ్యత మిడియాపై ఉంది అందులో భాగంగా మంచు కుటుంబంలో జరుగుతున్న తగాదాలను కవర్ చేయడానికి వెళ్లిన ఆంధ్రజ్యోతి, టీవీ9, టీవీ5, మరికొంత మంది విలేకరులపై మోహన్ బాబు దాడి చేయడం సిగ్గుచేటు అన్నారు. ఒక మాజీ రాజ్యసభ సభ్యుడు విద్యాసంస్థల అధినేత సీనియర్ సినీ నటుడు ఎందరికో మార్గదర్శకంగా నిలబడవలసిన మోహన్ బాబు ఇలా విలేకరులపై దాడి చేయడం ఎంత మాత్రం సమంజసం కాదని హితువు పలికారు. మోహన్ బాబు బేషరతుగా మీడియా మిత్రులకు క్షమాపణ చెప్పకపోతే మీడియా మిత్రుల విశ్వరూపం చూడాల్సి వస్తుందని హెచ్చరించిన వారిలో గద్దల వెంకన్న ఉన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App