‘భద్రతా వైఫల్యం’పై మోదీ కీలక భేటీ.. లోక్‌సభలో 8 మంది సిబ్బందిపై వేటు
దిల్లీ: దేశ అత్యున్నత ప్రజాస్వామ్య వేదిక అయిన పార్లమెంటు లో బుధవారం చెలరేగిన అలజడి పెను సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే..
ఈ ఘటనపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ గురువారం కీలక మంత్రులతో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, మంత్రులు ప్రహ్లాద్ జోషీ, అనురాగ్ ఠాకూర్, పీయూష్ గోయల్ తదితరులు ఈ భేటీలో పాల్గొన్నారు. భాజపా జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా కూడా సమావేశానికి హాజరయ్యారు.
ఎనిమిది మంది సిబ్బందిపై వేటు..
మరోవైపు భద్రతా వైఫల్యంపై లోక్‌సభ సెక్రటేరియట్ చర్యలు చేపట్టింది. ఆ సమయంలో విధుల్లో ఉన్న ఎనిమిది మంది భద్రతా సిబ్బందిని సస్పెండ్ చేసినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి.