harat Rice Nafed : పేదలకు సర్కార్ బియ్యం..తక్కువ ధరకే మోదీ విక్రయం
న్యూఢిల్లీ – దేశంలోని సామాన్యులు, నిరుపేదలకు ఖుష్ కబర్ చెప్పారు మోదీ నేతృత్వంలోని బీజేపీ కేంద్ర ప్రభుత్వం. నిత్యావసర ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో బతికే పరిస్థితులు లేకుండా పోయాయి. ఇప్పటికే దేశ వ్యాప్తంగా ఆహార పదార్థాలను తక్కువ ధరకే అందుబాటులోకి తీసుకు వచ్చేందుకు శ్రీకారం చుట్టింది కేంద్రం.
ఇప్పటికే భారత్ బ్రాండ్ పేరుతో కంది పప్పు, గోధుమ పిండిని విక్రయిస్తోంది. ఇందుకు సంబంధించి దేశ వ్యాప్తంగా భారత్ పేరుతో రిటైల్ అవుట్ లెట్ (స్టోర్స్ ) లను ఏర్పాటు చేసింది. ఇదిలా ఉండగా ఇక నుంచి బియ్యాన్ని కూడా డిస్కౌంట్ ధరకు విక్రయించాలని కేంద్ర సర్కార్ యోచిస్తోంది. త్వరలోనే భారత్ రైస్ పేరుతో కిలో బియ్యాన్ని కేవలం రూ. 25కే విక్రయించేందుకు సన్నాహాలు ఏర్పాటు చేస్తోంది.
ప్రస్తుతం భారత్ బ్రాండ్ కింద రూ. 60కే కేజీ శనగ పప్పు , రూ. 27.50 కే కిలో గోధుమ పిండిని విక్రయిస్తూ వస్తోంది కేంద్ర ప్రభుత్వం. నాఫెడ్ ద్వారా దేశంలోని 2 వేల రిటైల్ పాయింట్లలో వీటిని అమ్ముతోంది . ఆయా స్టోర్లలో వీటిని విక్రయించడం వల్ల సామాన్యులకు మేలు చేకూరుతోంది.