TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం. అనపర్తి మండలం రామవరంలో ఎమ్మెల్సీగా ఎన్నికైన తరువాత మొట్టమొదటిసారిగా రామవరం విచ్చేసిన ఎమ్మెల్సీ సొము వీర్రాజు,ని ఘనంగా సత్కరించి, కూటమి శ్రేణులతో కలిసి గజమాలను వేసి సాలువ కప్పి జ్ఞాపికను అందజేసిన అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి.

అనంతరం కూటమి నాయకులు ఒక్కొక్కరిగా ఎమ్మెల్సీ సోము వీర్రాజుకు పూలమాలలు వేసి సాలువలు కప్పి సత్కరించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్సీ సోము వీర్రాజు మీడియాతో మాట్లాడుతూ మైండ్ గేమ్ పాలిటిక్స్ కు రాష్ట్రంలో చోటు లేదని,జగన్ మైండ్ గేమ్ పాలిటిక్స్ ధోరణితో వ్యవహరిస్తున్నారన్నారు.గతంలో 60 స్థానాలు వచ్చిన జగన్ అసెంబ్లీకి రాలేదని ఇప్పుడు 11 సీట్లతో ప్రతిపక్ష హోదా ఇస్తే అసెంబ్లీకి వస్తానడం పొలిటికల్ స్టంట్ మాత్రమేనన్నారు. అమరావతి రాజధాని అనే బిజెపి స్పష్టంగా ఉందన్నారు.

వైజాగ్ స్టీల్ ప్లాంట్ కు కేంద్ర ప్రభుత్వం అద్భుతమైన ప్యాకేజీ ఇచ్చిందన్నారు. దేశం,రాష్ట్రం ప్రగతి పథంలో వెళ్లే అనేక కార్యక్రమాలు ప్రధాని మోదీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేస్తున్నారన్నారు.

కూటమి ప్రభుత్వం అనుకున్నవన్నీ చేస్తుందని జగన్ చెప్పినవి చేయదన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలోని హామీలున్నటిని కూటమి ప్రభుత్వం నెరవేరుస్తుందన్నారు.

ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు బొమ్మల దత్తు,రేలంగి శ్రీదేవి,హరినారాయణరెడ్డి,నాలుగు మండలాల టిడిపి, జనసేన, బిజెపి అధ్యక్షులు,కూటమి నాయకులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

MLC Somu Veerraju