TRINETHRAM NEWS

MLA Vijayaramana Rao participated in the general meeting of Eligedu Primary Agricultural Cooperative Society

పెద్దపల్లి త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

శుక్రవారం ఎలిగేడు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అధ్యక్షులు విజయ భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన సర్వ సభ్య సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణ రావు

సర్వ సభ్య సమావేశం సందర్భంగా సహకార సంఘం ఎమ్మెల్యే స్వాగతం పలికి ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయరమణ రావు మాట్లాడుతూ

రైతన్నలను ఏకం చేస్తూ రైతుల అందరిని ఒకే వేదికపై తీసుకువచ్చే సహకార సంఘాలను అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే విజయరమణ రావు అన్నారు. రైతుల పంటల కొనుగోలు విషయంలో ప్రభుత్వానికి మరియు రైతులకు సహకార సంఘాలు వారదిలగా పనిచేస్తున్నాయని పేర్కొన్నారు. రైతు రుణాల విషయంలో కూడా సహకార సంఘాలు ఎంతో తోడ్పడుతున్నాయి అని అన్నారు. రైతు సోదరులకు రూ. 2 లక్షల రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ సర్కార్ దే అని రైతు రుణమాఫీ విషయంలో ప్రతిపక్షాలు చేస్తున్న మాటలు బోగస్ మాటలని విమర్శించారు. గత పాలకుల హయంలో రైతుల పంటల విషయంలో తరుగు పేరిట రైతులను నట్టేట ముంచారని విమర్శించారు. రైతును రాజు చేయడమే కాంగ్రెస్ లక్ష్యమని ఈ సందర్భంగా తెలిపారు. ఈ వర్షాకాలపు సన్న రకం వడ్లకు రూ. 500 బొనస్ ఇస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ విజయ భాస్కర్ రెడ్డి, మాజీ చైర్మన్ సుధాకర్ రెడ్డి, సహకార సంఘం సభ్యులు, రైతులు, అధికారులు, ఎలిగేడు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సామ రాజేశ్వర రెడ్డి, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు మరియు తదితరులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

MLA Vijayaramana Rao participated in the general meeting of Eligedu Primary Agricultural Cooperative Society