TRINETHRAM NEWS

MLA Raj Thakur personally supervised the construction work of the recently inaugurated shopping complex near the 20th Division Railway Station

రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

ప్రభుత్వానికి సంబంధించిన స్థలాలలో నిరుపయోగమైన భవనాలు ఉన్నట్లయితే వాటిని తొలగించి ఆ ప్రాంతంలో ప్రజలకు అవసరమైన నిర్మాణాలను చేపట్టడమే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ధ్యేయమని పెద్దపెల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రామగుండం శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ అన్నారు

ప్రజల కోసమే ప్రజా పాలన షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం స్థానిక ప్రజల ఎన్నో ఏళ్ల కాల ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్

ప్రభుత్వానికి సంబంధించిన స్థలాలలో నిరుపయోగమైన భవనాలు ఉన్నట్లయితే వాటిని తొలగించి ఆ ప్రాంతంలో ప్రజలకు అవసరమైన నిర్మాణాలను చేపట్టడమే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ధ్యేయమని పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రామగుండం శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ వెల్లడించారు. ఈ మేరకు రామగుండం కార్పొరేషన్ 20వ డివిజన్ రైల్వే స్టేషన్ సమీపంలో ఇటీవల ప్రారంభమైన షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణ పనులను ఆయన స్వయంగా పర్యవేక్షించారు.

ఈ కాంప్లెక్స్ నిర్మాణానికి సమీపంలో అడ్డుగా ఉన్న నిరుపయోగమైన నిర్మాణాలను తొలగించాలని సంబంధిత అధికారులను సూచించారు. తద్వారా ఈ ప్రాంతంలో వర్తక, వాణిజ్య సంస్థలు మరింత అభివృద్ధి చెందుతాయని పేర్కొన్నారు. అలాగే చిన్న చిన్న వ్యాపారులు ఆర్థికంగా ఎదుగుతారని అన్నారు. షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం స్థానిక ప్రజల ఎన్నో ఏళ్ల కల అని పేర్కొన్నారు. దానిని దృష్టిలో ఉంచుకొని ప్రత్యేక దృష్టి సారించి అధునాతన రీతిలో షాపింగ్ కాంప్లెక్స్ అందరికీ అవసరమయ్యే హంగులతో నిర్మిస్తామన్నారు. తద్వారా అన్ని వర్గాల వారికి అనుకూలంగా ఉంటుందన్నారు. అలాగే తక్కువ సమయంలో నాణ్యతతో కూడిన నిర్మాణపు పనులు చేస్తామని ఆయన అన్నారు. ఎమ్మెల్యే వెంట అధికారులు, కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులు ఉన్నారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కార్పొరేటర్లు మాజీ కార్పొరేటర్ వివిధ విభాగాల అధ్యక్షులు తదితరులు ఉన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

MLA Raj Thakur personally supervised the construction work of the recently inaugurated shopping complex near the 20th Division Railway Station