TRINETHRAM NEWS

ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి మన ఊరు మన ఎమ్మెల్యే.
త్రినేత్రం న్యూస్. ప్రకాశం జిల్లా మార్కాపురం.
మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి గారు మార్కాపురం పట్టణంలోని 4వ వార్డులో “మన ఊరు- మన ఎమ్మెల్యే” కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వార్డులో కలియతిరుగుతూ ప్రజా సమస్యలు అడిగి తెలుసుకున్నారు.
అనంతరం మాట్లాడుతూ ముఖ్యంగా నాలుగో వార్డ్ లో డ్రైనేజ్ సమస్య తీవ్రంగా ఉందని పంట కాలవలో మురుగు బ్లాక్ అయ్యి మురుగునీరు ప్రవహించడం లేదని అందువలన తీవ్ర దుర్గంధం వెదజల్లుతూ దోమల సమస్యతో డెంగు చికెన్ గున్యా లాంటి జబ్బులు ప్రజలకు వస్తున్నాయని అన్నారు.
ఈ సమస్యను రెండు మూడు రోజుల్లో పరిష్కరిస్తామని అధికారులు తక్షణమే స్పందించి రెండు మూడు రోజుల్లో ఈ సమస్య పరిష్కరించాలని అప్పటికప్పుడే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా ప్రజలు కొత్త పెన్షన్లకు కొత్త రేషన్ కార్డులు కావాలని శాసనసభ్యులు వారి దృష్టికి తీసుకువచ్చారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, తెలుగుదేశం నాయకులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App