TRINETHRAM NEWS

రామగుండం లో ప్రభుత్వ నర్సింగ్ కళాశాల ప్రారంభించిన ఎమ్మెల్యే మక్కాన్సింగ్ రాజ్ ఠాకూర్

తల్లి జన్మనిస్తే, వైద్యుడు జీవం పోస్తున్నాడు, అందుకే వైద్యో నారాయణ హరి అన్నారుఎమ్మెల్యే మక్కాన్సింగ్

నర్సింగ్ కాలేజీ విద్యార్థులు మాతృమూర్తి మదర్ థెరిసా ను మార్గదర్శకంగా తీసుకోవాలి ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్

గోదావరిఖని పట్టణంలో రామగుండం ఎమ్మెల్యే మక్కాన్సింగ్ రాజ్ ఠాకూర్ ప్రభుత్వ నర్సింగ్ కళాశాలను శిలాఫలకాన్ని ఆవిష్కరించి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించడం జరిగినది. నియోజకవర్గంలో ఉన్న హిజ్రాలను దృష్టిలో ఉంచుకొని మైత్రి ట్రాన్స్ క్లినిక్ సమగ్ర వైద్యం సమాన గౌరవం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ లక్ష్యం అని ప్రత్యేక వైద్య విభాగాన్ని ప్రారంభించడం జరిగినది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ గత ప్రభుత్వ పాలకుల నిర్లక్ష్యపుపాలనలో అసంపూర్తిగా వదిలేసిన మెడికల్ కాలేజీ పూర్తిస్థాయి నిర్మాణానికి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రివర్యులు రేవంత్ రెడ్డి సహకారంతో నేటితో గడీల పాలనకు తెరపడి ప్రజాపాలన సంవత్సర కాలం పూర్తయిన సందర్భంగా రామగుండం పారిశ్రామిక ప్రాంతాన్ని మంత్రివర్యులు శ్రీధర్ బాబు సహకారంతో పూర్తిస్థాయిలో మెడికల్ హబ్ గా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలు అందజేయనున్నదని తప్పకుండా రామగుండంలో నాణ్యమైన వైద్యం ప్రతి నిరుపేదకు అందే విధంగా ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నామని తల్లి జన్మనిస్తే వైద్యుడు జీవం పోస్తున్నాడని, వైద్యుడు దైవంతో సమానమని దేవుడి తర్వాత అంతలా రెండు చేతులెత్తి మొక్కే ప్రతిరూపం వైద్యుడు అని ఇక్కడున్న విద్యార్థులంతా మదర్ తెరిసాను ఆదర్శవంతంగా తీసుకొని ఉన్నతమైన వైద్యులుగా అవతరించాలని ప్రతి ఒక్కరూ తమ గమ్యస్థానానికి చేరుకోవాలని సమాజంలో వైద్యులకు వైద్య రంగానికి ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుందని ఎమ్మెల్యే మక్కాన్సింగ్ రాజ్ ఠాకూర్ మాట్లాడం జరిగినది. ఈ కార్యక్రమంలో హాస్పిటల్, మెడికల్ కాలేజ్ సూపరిండెంట్ పాటు ప్రముఖ వైద్య నిపుణులు, రామగుండం కార్పొరేషన్ మేయర్ బండి అనిల్ కుమార్, కార్పొరేటర్లు,ఆయా విభాగాల అధ్యక్షులు నర్సింగ్ కళాశాల విద్యార్థులు సంబంధిత సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App